ఇస్మార్ట్ శంకర్ మూవీకి సీక్వెల్‌.. కిర్రాక్‌ అప్డేట్‌

-

యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని , డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ లది బ్లాక్ బస్టర్ కాంబినేషన్. వాళ్ళిద్దరూ చేసిన ‘ఇస్మార్ట్ శంకర్’ బాక్సాఫీస్ బరిలో రికార్డులు క్రియేట్ చేసింది. ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఆ సినిమా ఎండింగులోనే దానికి సీక్వెల్ ఉంటుందని ప్రకటించారు. తామిద్దరం కలిసి మరో సినిమా చేస్తామని రామ్, పూరి అనౌన్స్ చేశారు కూడా. ఇప్పుడు వాళ్ళ కాంబినేషన్ కుదిరింది. మే 15 రామ్ పోతినేని పుట్టిన రోజున కావడంతో, ఫాన్స్ కి గిఫ్ట్ ఇస్తూ ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమా గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చాడు పూరి.

Double iSmart: Puri Jagannadh and Ram Pothineni Reunite for iSmart Shankar  Sequel | 🎥 LatestLY

ఇక ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ మార్చ్ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని అనౌన్స్ చేస్తూ ఒక పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. అయితే డబుల్ ఇస్మార్ట్ మూవీని తెలుగుకి మాత్రమే పరిమితం చేయలేదు పూరి. ఈ సినిమాని పాన్ ఇండియా రేంజుకి తీసుకెళ్ళాడు. రామ్ పోతినేని-బోయపాటి మూవీ షూటింగ్ ఫినిష్ అవగానే డబుల్ ఇస్మార్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది.మరి పూరి-రామ్ పోతినేని కలిసి మరోసారి మాస్ హిస్టీరియా రిపీట్ చేస్తారేమో చూడాలి.

 

 

Read more RELATED
Recommended to you

Latest news