వైరల్‌: పక్కింట్లో శృంగార శబ్ధాలు.. వినలేక లేఖ రాసిన మహిళ..!!

-

వైరల్‌: పక్కింటి వాళ్ల వల్ల చెత్త మా వైపు వచ్చింది, మీ పిల్లలు మా ముగ్గు చెరిపేశారు, మీ వస్తువులు మా ఇంట్లో పడేశారు..ఇలాంటి లొల్లి ఉండటం కామన్‌.. కానీ పాపం ఆ మహిళలకు పక్కింటి వారి వల్ల పెద్ద సమస్యే వచ్చింది.. దాని గురించి వారికి డైరెక్టుగా చెప్పలేక.. లేఖ రాసి ఏకంగా నెట్టింట పెట్టేసింది.. అది కాస్త వైరల్‌ అవుతోంది.. ఇంతకీ ఆ మహిళకు వచ్చిన సమస్య ఏంటో తెలుసా..? పక్కింటి వాళ్లు రోజు రాత్రి పగలకు తేడా లేకుండా సెక్స్‌ చేసుకుంటూ చేసే శబ్ధాల వల్ల ఈమెకు ఇబ్బందిగా ఉందట..! ఆ శృంగారం ఆపండయ్యా బాబూ అని లేఖ రాసింది..!

 

సోషల్ మీడియాలో ఓ లెటర్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. అలీ ఇన్‌ మై మెరీనెరా(ali in my marinera) అనే పేరుతో ఉన్న ట్విట్టర్ (Twitter)అకౌంట్ నుంచి ఆ లెటర్‌ పోస్ట్ చేయబడింది. అందులో ముఖ్యంగా తన పక్క పోర్షన్‌లో ఉంటున్న వాళ్లు రోజూ పగలు, రాత్రి అని తేడా లేకుండా శృంగారం చేసుకుంటున్నారని ..ఆ సమయంలో వాళ్లు చేసే పెద్ద పెద్ద శబ్దాల వల్ల తనకు నిద్ర పట్టనివ్వడం లేదని ఆ మహిళ పేర్కొంది. అంతే కాదు దాని వల్ల తాను రాత్రి వేళల్లో తన బెడ్‌ రూమ్‌(Bedroom)లోకి వెళ్లాలేకపోతున్నానని..తన మనసు ఏకాగ్రతను కోల్పోతుందని లెటర్‌లో పేర్కొంది. మీరు చాలా ఆరోగ్యకరమైన లైంగిక జీవితాన్ని గడిపినందుకు మీకు అభినందనలు… అయితే మీ రాసలీలల్లో నన్ను భాగం చేయకుండా చూడాలని కోరుకుంటున్నానని లేఖ ద్వారా విన్నవించుకుంది. హైలెట్‌ ఏంటంటే… లేఖతో పాటు.. వాళ్లకు రెండు బీర్‌ సీసాలు పంపింది.

ఇరుగుపొరుగు వారితో ఇలాంటి సమస్యలు కూడా ఉంటాయా అనే సందేహాలు ఇప్పుడు అందరికి కలుగుతోంది. అసలు పొరుగు ఇంటి వాళ్ల వ్యక్తిగత జీవితం, బెడ్రూం వ్యవహారం తనకు నచ్చడం లేదని లేఖ ద్వారా తెలియజేయడం చూసి జనం నవ్వుకుంటున్నారు. ఇదో విచిత్రమైన వార్తగా భావిస్తున్నారు. అలీ ఇన్ మై మెరీనెరా అనే ట్విట్టర్ యూజర్ వెలగబెట్టిన ఘనకార్యం ఇది. సోషల్ మీడియాలో ఏదైనా విచిత్రమైన వార్త చేరడమే ఆలస్యం ..వెంటనే వైరల్ అవుతుంది. ఇప్పుడు అలీ ఇన్ మై మెరీనెరా ట్విట్టర్ అకౌంట్ హోల్డర్ పెట్టిన ట్వీట్‌, షేర్ చేసిన ఫోటో కూడా అంతే వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఒక్కో. రకంగా స్పందిస్తున్నారు. ఆమె ఇలా చేసి ఉండకూడదని కొందరు అంటుంటే.. ఇంకొందరు ఫన్నీగా రియాక్ట్‌ అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news