డెంగ్యూ.. ఇది అతి ప్రమాదకరమైనది. ఇప్పుడు ఇది హైదరాబాద్ నగరవాసులకు నిద్రలేకుండా చేస్తుంది. ఎన్నడు కనివిని ఎరుగని రీతిలో డెంగ్యూ విజృంభిస్తుంది. దీంతో నగరవాసులు డెంగ్యూ భయంతో కొట్టుమిట్టాడుతున్నారు. హైదరాబాద్ నగరంలో నిత్యం కురుస్తున్న వర్షాలతో డెంగ్యూ విజృంభిస్తుందట. కేవలం ఆరు రోజుల్లో హైదరాబాద్‌లో 172 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. అంటే నగరంలో డెంగ్యూ ఎలా విస్తరిస్తుందో అర్థమవుతుంది. కేవలం హైదరాబాద్ నగర వ్యాప్తంగా డెంగ్యూ ఇలా ఉంటే ఆరు రోజుల్లోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 633కేసులు ఉన్నట్లు గుర్తించారు వైద్య ఆరోగ్య శాఖ.
గతేడాది కంటే ప్రస్తుత సంవత్సరంలో డెంగ్యూ బాధితులు భారీగా పెరిగి పోయారు. ఇతర వ్యాధుల కారణంగా డెంగ్యూ వాపిస్తున్న వారు 5-6 శాతం ఉన్నట్లు నిపుణులు వెల్లడించారు. మలేరియా వంటి జబ్బులతోనూ డెంగ్యూ వాపిస్తున్నట్లు తెలుస్తుంది. న్యూమోనియా, గ్యాస్ట్రో ఇంటిస్టినల్ ఇన్ఫెక్షన్స్ కారణంగానూ డెంగ్యూ సంక్రమిస్తోంది. నగరంలో నిత్యం కురుస్తున్న వర్షాలతో నగరమంతా తడిగా మారి ఎక్కడ చూసిన మురుగునీరు నిల్వ గుంటలు ఏర్పడ్డాయి. డ్రైనేజీల్లో వచ్చిన వరదతో చెత్తా చెదారం పేరుకుపోయి మురుగునీరు పెద్ద ఎత్తున స్టోరేజీ అవుతుంది.
వీటికి తోడు నగరాల్లో వెలిసిన లోతట్టు ప్రాంతాల్లోనూ దోమల పెరుగుదల కనిపిస్తుంది. ఇంకా నగరంలో పారిశుధ్య లోపం కూడా కొట్టొచ్చినట్లు కనిపించడంతో దోమలకు ఆవాసాలుగా మారి డెంగ్యూ వ్యాప్తికి కారకమవుతున్నాయి. ఇక నగరంలో విజృంభిస్తున్న డెంగ్యూను నివారించాలంటే సర్కారు వెంటనే తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. డెంగ్యూ సీజన్ ముగిసిందని అంతా అనుకుంటున్న తరుణంలో మళ్ళీ డెంగ్యూ కేసులు ఎక్కువగా నమోదు అవుతుండటం అందరిని కలవరపరుస్తుంది. డెంగ్యూ నివారణకు చర్యలు తీసుకోకపోతే హైదరాబాద్ నగరం ఓ డెంగ్యూ నగరంగా మారనున్నది..