ఆధార్ కార్డు పోయిందా?.. అస్సలు నంబర్ కూడా గుర్తు లేదా?.. వెంటనే ఇలా చెయ్యండి..

-

మనకు ఉన్న అతి ముఖ్యమైన డాక్యుమెంట్స్ లో ఆధార్ కూడా ఒకటి.. ఆధార్ లేకుంటే తినే రేషన్ నుంచి చదువులకు ఇలా ప్రతి దానికి ఆధార్ తప్పనిసరి అయిపొయింది..మరి ఇంత ముఖ్యమైన ఆధార్ కార్డ్‌ను పోగొట్టుకుంటే.. ఆధార్‌ నంబర్‌ కూడా గుర్తు లేకుంటే ఏం చేయాలి.. డూప్లికేట్‌ ఆధార్‌ ఎలా పొందాలి?

ఆధార్‌ కార్డ్‌ మన రోజువారీ జీవనంలో భాగమైపోయింది. బ్యాంకు వెళ్లినా.. ఏదైనా ప్రభుత్వ పథకానికి దరఖాస్తు చేయాలన్నా ఆధార్‌ కార్డ్‌ చాలా ముఖ్యమైపోయింది. ఒక వేళ మన ఆధార్‌ కార్డ్‌ పోగొట్టుకునిపోతే ఆధార్‌ నంబర్‌ గుర్తుంటే ఈ ఆధార్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. మరి ఆ నంబర్‌ కూడా గుర్తు లేనప్పుడు ఆధార్‌ కార్డ్‌ను పొందడం ఎలాగో తెలియక తికమక పడుతుంటారు. ఇప్పుడు ఆధార్‌ నంబర్‌ గుర్తు లేకపోయినా సరే ఆధార్‌ కార్డ్‌ పొందవచ్చు.. ఎలానో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ఇప్పుడు తెలుసుకుందాం..ఎలాగంటే..

*. UIDAI సర్వీస్ పోర్టల్ ను ఓపెన్‌ చెయ్యాలి.

*. లాస్ట్ లేదా ఫర్గెటెన్ UID/EID’ బటన్ పై క్లిక్ చేయాలి.

*. ఆధార్ నంబర్, మీ పూర్తి పేరు, ఆధార్‌తో రిజిస్టర్ అయిన మొబైల్ నంబర్‌ను నమోదు చేయాలి.

*. స్క్రీన్ పై కనిపించే సెక్యూరిటీ కోడ్ టైప్ చేసి, ‘వన్ టైం పాస్ వర్డ్ పొందండి’ బటన్ పై క్లిక్ చేయాలి.

*. మీ రిజిస్టర్ మొబైన్ నెంబర్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాలి. ఆతర్వాత మొబైల్‌కు ఎన్‌రోల్‌మెంట్ నంబర్‌ వస్తుంది.

*. తిరిగి UIDAI సెల్ఫ్ సర్వీస్ పోర్టల్‌ లోకి మళ్లీ వెళ్లి.. ‘డౌన్ లోడ్ ఆధార్’ బటన్ క్లిక్‌ చేయాలి.

*. మీ ఆధార్ నంబర్ లేదా ఎన్‌రోల్‌మెంట్ నంబర్, పేరు, పిన్ కోడ్ , క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయాలి.

*.’‘గెట్ వన్ టైం పాస్ వర్డ్’ బటన్ క్లిక్ చేసి, మీ రిజిస్టర్డ్ మొబైల్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాలి.

*. ఓటీపీ వెరిఫికేషన్ తర్వాత, మీ ఆధార్ కార్డు కాపీని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు..

ఇలా చేసుకోవచ్చు లేదా కస్టమర్ సర్వీసుకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు..

Read more RELATED
Recommended to you

Latest news