TSPSC పేపర్ లీక్‌ కేసు.. మరో ముగ్గురు అరెస్టు

-

తెలంగాణలో సంచలనం సృష్టించిన టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసు ఇప్పట్లో ఓ కొలిక్కి వచ్చేలా లేదు. ఇప్పటికే 20 మందికిపైగా అరెస్టు చేశారు. తాజాగా మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. క్రాంతి, రవితేజ, శశిధర్​ను అరెస్టు చేసి సిట్​ అధికారులు కోర్టులో హాజరుపరిచారు. అయితే ఏఈఈ ప్రశ్నపత్రాన్ని మురళీధర్ వద్ద క్రాంతి, శశిధర్ కొనుగోలు చేశారు. అలాగే డీఏవో ప్రశ్నపత్రాన్ని సాయిలౌకిక్ వద్ద రవితేజ కొనుగోలు చేశారు.

అలాగే మే 9న సిట్ అధికారులు మరో నలుగురిని అరెస్ట్ చేశారు. నలుగురు కూడా ఏఈ, ఏఈఈ ప్రశ్నపత్రం కొనుగోలు చేసినట్లు సిట్ దర్యాప్తులో తేలింది. ఇప్పటికీ మొత్తం ఈ కేసులో అరెస్టుల సంఖ్య 30కు చేరింది. ఈ నలుగురు నిందితులు కూడా ప్రవీణ్, డాక్యా నుంచి ప్రశ్నపత్రాలు కొనుగోలు చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి, డాక్యా నాయక్, రాజేశ్వర్ నాయక్​లను రెండు సార్లు కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించినా ప్రశ్నపత్రాల లీకేజీకి సంబంధించి పెద్దగా వివరాలు వెల్లడించలేదు. దీంతో సిట్ అధికారులు సాంకేతికతను ఆధారంగా చేసుకొని దర్యాప్తు నిర్వహించారు.

Read more RELATED
Recommended to you

Latest news