ఈ హెర్బల్‌ టీలు తాగితే.. కిడ్నీలు క్లీన్‌ అయిపోతాయి..!

-

కిడ్నీ ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టడం చాలా అవసరం. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా మంది కిడ్నీ సమస్యల తో బాధ పడుతున్నారు పైగా కిడ్నీలు ఎంతో ముఖ్యమైన అవయవాలు. శరీరమంతా ప్రవహించిన రక్తాన్ని ఫిల్టర్ చేస్తాయి కిడ్నీలు పైగా రక్తం లోని వ్యర్ధ పదార్థాలని వడపోసి మూత్ర రూపం లో బయటకు పంపిస్తాయి శరీరం లో వ్యర్థాలను తొలగించడంతో పాటుగా బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్ లో ఉంచుతాయి.

కిడ్నీలు ఎర్ర రక్త కణాలని తయారుచేస్తాయి ఎముకలని దృఢంగా ఉంచుతాయి. అయితే కిడ్నీలు ఆరోగ్యంగా ఉండడానికి ఈ హెర్బల్ టీలు బాగా ఉపయోగ పడతాయి పైగా కిడ్నీలు శుభ్రంగా కూడా ఉంటాయి. కిడ్నీల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి అల్లం బాగా ఉపయోగపడుతుంది. అల్లంని టీ రూపంలో కూడా తీసుకోవచ్చు కిడ్నీ లో వాపు నొప్పిని అల్లం తగ్గిస్తుంది కిడ్నీలు ఆరోగ్యంగా ఉండేటట్టు చేస్తుంది కాబట్టి అల్లం టీ ని తరచుగా తాగుతూ ఉండండి.

తిప్పతీగ కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది కిడ్నీల ఆరోగ్యానికి తిప్పతీగ మేలు మెరుగుపరుస్తుంది మూత్రపిండాలపై భారాన్ని తగ్గిస్తుంది తిప్పతీగ. అలానే మూత్రపిండాల ఆరోగ్యం కూడా పెరుగుతుంది. కిడ్నీలు దెబ్బ తినకుండా తిప్పతీగ రక్షిస్తుంది అదేవిధంగా మూత్రపిండాల్లో వ్యర్థాలను తొలగించడానికి త్రిఫల బాగా ఉపయోగపడుతుంది. ఉసిరి కరక్కాయ తానికాయతో దీనిని తయారు చేస్తారు. యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ ఇంఫ్లమేటరీ గుణాలు కూడా ఇందులో ఎక్కువ ఉంటాయి. పసుపు కూడా బాగా హెల్ప్ అవుతుంది. కిడ్నీ సమస్యలతో బాధపడే వాళ్ళు పసుపుని కూడా టీ రూపం లో తీసుకోవచ్చు నీళ్లలో పసుపు వేసుకుని తీసుకుంటే కూడా చక్కటి ప్రయోజనాలను పొందవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news