తెలంగాణ రాష్ట్రంలోని పంచాయతీ కార్యదర్శులు అంతా ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విధులు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఉదయం, మధ్యాహ్నం వారి హాజరు నోట్ కామ్ ద్వారా ఆన్లైన్ లో పంపాలని సూచించింది.
అలాగే రోజు వారి చేసిన పనుల వివరాలను మధ్యహ్ననికి పంపాలని తెలిపింది. సమ్మె విరమణ తర్వాత కొందరు కార్యదర్శులు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారన్న ఫిర్యాదుతో సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. కాగా.. మొన్న టి వరకు పంచాయతీ కార్యదర్శులు సమ్మె చేసిన సంగతి తెలిసిందే. కానీ ప్రభుత్వం హామీ ఇవ్వడంతో.. పంచాయతీ కార్యదర్శులు సమ్మె విరమించారు.