BREAKING: BJP పార్టీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. హర్యానాలోని అంబాల బిజెపి ఎంపీ రతన్ లాల్ కటారియా కన్నుమూశారు. న్యూమోనియాతో బాధపడుతున్న ఆయన చండీగఢ్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
1951లో జన్మించిన ఈయన హరియానా బీజేపీ అధికార ప్రతినిధిగా, అధ్యక్షుడిగా, మంత్రిగా పనిచేశారు. 2019 సాధారణ ఎన్నికల్లో అంబాల నుంచి మూడోసారి MPగా గెలిచారు. 2021 వరకు కేంద్ర జల్ శక్తి, సామాజిక న్యాయ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇక అంబాల బిజెపి ఎంపీ రతన్ లాల్ కటారియా మృతి పట్ల.. ఆ పార్టీ అగ్ర నేతలు సంతాపం తెలియజేస్తున్నారు.