జపాన్‌కు చెందిన ప్రముఖ ఐస్ క్రీమ్ బ్రాండ్ సెలాటో ఓ స్పెషల్ ఐస్ క్రీమ్‌ను తయారు చేసింది. అయితే ఈ ఐస్ క్రీమ్ ధర చూస్తే మాత్రం మీకు కచ్చితంగా షాక్ అవుతారు. ఎందుకంటే ఈ ఐస్ క్రీమ్ ప్రంపంచంలోనే అత్యంత ఖరీదైన ఐస్ క్రీమ్. అత్యంత అరుదుగా దొరికే పదార్థాలతో కలిపి చేసిన ఈ ఐస్‌క్రీమ్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా రికార్డు సాధించింది. ఈ ఐస్‌క్రీమ్‌ను 8,73,400 జపనీస్ యెన్ (భారత కరెన్సీలో దాదాపు రూ.5.2లక్షలు)ల చొప్పున విక్రయిస్తోంది.
దీని తయారీలో ఉపయోగించిన వైట్ ట్రఫుల్ అనే అరుదైన పదార్థాన్ని ఇటలీలోని ఆల్బా నుంచి తెప్పించింది. ఈ ట్రఫుల్ ధర కిలోకు 2 మిలియన్ జపనీస్ యెన్లు ఉంటుందట. ఆల్బాలో మాత్రమే దొరికే దీని సువాసన చాలా ప్రత్యేకంగా ఉంటుంది. దీనివల్లే ఈ ఐస్‌క్రీమ్ ధర ఇంతగా ఉందట. దీంతో పాటు పర్మిజియానో రెగ్గియానో అనే చీజ్, సేక్ లీస్ అనే వైట్ సాస్ వంటి పదార్థాలు కూడా ఇందులో వాడారు. దీంతో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఐస్‌క్రీమ్‌గా ఇది గిన్నిస్ రికార్డు సాధించింది.