చంద్రబాబుకు అమర్నాథ్‌ సవాల్‌..రాజకీయాల నుంచి తప్పుకుంటా !

-

చంద్రబాబుకు మంత్రి అమర్నాథ్ సవాల్‌ విసిరారు. విస్సన్నపేట భూములపై చంద్రబాబు సవాల్ ను స్వీకరించిన మంత్రి అమర్నాథ్….నా పేరు మీద కానీ కుటుంబ సభ్యుల పేరు మీద కానీ అరసెంటు ఉందని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని కౌంటర్‌ ఇచ్చారు. భూ అక్రమాల ఆరోపణలు రుజువు చెయ్యలేకపోతే లోకేష్ ను రాజకీయాల నుంచి తప్పిస్తావా…..? తప్పు చేయాలిసి వస్తే నడిరోడ్డుపై ఉరేసుకుంటాను తప్ప ధర్మం తప్పను అని తేల్చి చెప్పారు మంత్రి అమర్నాథ్.

రెండు వేల రూపాయలు నోట్లు రద్దు సలహా నాదేనని చంద్రబాబు ప్రచారం చేసుకోవడం హాస్యాస్పదం అని ఎద్దేవా చేశారు మంత్రి అమర్నాథ్. 2016లో పెద్ద నోట్ల రద్దును ఆహ్వానించిన చంద్రబాబు బీజేపీతో తెగతెంపులు రాగానే తుగ్లక్ చర్యగా చెప్పి న మాటలు గుర్తు చేసుకోవాలని తెలిపారు. చంద్రబాబువి బ్యాక్ డోర్ పాలిటిక్స్….ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో షుగర్ ఫ్యాక్టరీలను మూసేసిన పాపం చంద్రబాబుదే అని ఆగ్రహించారు మంత్రి అమర్నాథ్.

Read more RELATED
Recommended to you

Latest news