అతి తక్కువ పెట్టుబడితో భారీ ఆదాయం పొందే సూపర్ ప్లాన్..రూ.54లక్షల వరకూ పొందే అవకాశం..

ఎల్ఐసీ పాలసీల గురించి అందరికి తెలుసు.. ఎన్నో పథకాలు జనాల ఆదరణ పొందాయి.. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను పొందే స్కీమ్ లను అందిస్తుంది.. ఎప్పటికప్పుడు తమ కస్టమర్లకు మంచి బెనిఫిట్స్ ను అందిస్తుంది.. అందులో ఒకటి ఎల్ఐసీ జీవన్ పాలసీ ఒకటి.. ఇది బీమా, పొదుపు రెండు ప్రయోజనాలను అందిస్తుంది. ప్రతి నెలా కేవలం రూ.7,960 పెట్టుబడితో రూ.54 లక్షలు పొందవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

 

ఒకవేళ పాలసీదారు మరణిస్తే కుటుంబానికి ఆర్థిక సహాయం అందిస్తుంది. దీనితో పాటు పాలసీదారు మెచ్యూరిటీ వరకు జీవించి ఉంటే అతను ఏకమొత్తం కార్పస్‌ను పొందుతాడు. ఈ పథకంలో ఎంత మొత్తంలో బీమా పాలసీ కావాలి.. ఎంత వ్యవధిలో కావాలనే దాన్ని ఎంచుకునే అవకాశం పెట్టుబడిదారులకు లభిస్తుంది. ఈ పాలసీని 18 నుంచి 59 సంవత్సరాల మధ్య వయస్సు గల వ్యక్తులు ఎవరైనా ప్రారంభించవచ్చు…మీకు 25 ఏళ్లు ఉన్నాయనుకుంటే రూ. 20 లక్షల హామీ మొత్తం ఉంటుంది. మెచ్యూరిటీ మొత్తం రూ. 54 లక్షలు. ఇక్కడ బీమా చేయబడిన వ్యక్తి 16 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించవలసి ఉంటుంది.

ఈ పాలసీ మెచ్యూరిటీ వ్యవధి 25 సంవత్సరాలు ఉంటుంది. జీఎస్టీతో నెలవారీ ప్రీమియం రూ.7,960 అవుతుంది. 25 ఏళ్లలో చెల్లించిన మొత్తం ప్రీమియం సుమారు రూ. 14,67,118 కాగా, చివరి అదనపు బోనస్ రూ. 9 లక్షలతో పాటు మొత్తం మెచ్యూరిటీ మొత్తం రూ. 54 లక్షలు అవుతుంది..ఇక పాలసీ కింద, బీమా హోల్డర్లు 10, 15, 16 సంవత్సరాలకు ప్రీమియం చెల్లింపు నిబంధనలను ఎంచుకోవచ్చు 16 సంవత్సరాలు, 21 సంవత్సరాలు లేదా 25 సంవత్సరాల తర్వాత పాలసీ వ్యవధి పూర్తయిన తర్వాత సేకరించిన కార్పస్‌ను తిరిగి పొందుతారు. పాలసీ వ్యవధిలో పాలసీదారు మరణించిన సందర్భంలో, నామినీ పాలసీ యొక్క ప్రయోజనాలను అందుకుంటారు.. ఇందులో పన్ను మినహాయింపు కూడా ఉంటుంది..