అనిల్‌ కు నెల్లూరు డిప్యూటీ మేయర్ కౌంటర్‌..దాడి చేస్తే నువ్వు తట్టుకోలేవు..!

-

నెల్లూరులో గత రాత్రి వైసిపి యువ నాయకుడు పై దాడి నేపథ్యంలో డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ స్పందించారు. సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ పై నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దాడికి ప్రతి దాడి చేస్తే నువ్వు తట్టుకోలేవు అంటూ పరోక్ష హెచ్చరికలు జారీ చేశారు.. నీ అండదండలతో.. నీ అనుచరులు పెట్రేగిపోతున్నారని ఫైర్‌ అవుతున్నారు.

nellore-ycp-politics

నికార్సుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసమే పని చేస్తున్నానని.. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవడమే హాజీ చేసిన తప్పా అని నిప్పులు చెరిగారు. పార్టీ కోసం పని చేసిన వ్యక్తులను టార్గెట్గా చేసుకొని దాడులు చేస్తున్నారు.. ఇక ఎంత మాత్రం ఈ దాడులను సహించేది లేదన్నారు. పది మంది చిల్లర నాయాళ్లకు డబ్బులు ఇచ్చి వైసిపి నాయకులు కార్యకర్తలపై దాడులు చేయిస్తున్నారని ఫైర్‌ అయ్యారు. ఈ విషయాన్ని పార్టీ పెద్దలు దృష్టికి కూడా తీసుకువెళ్తాం…నాతో ఉన్న వైసిపి నేతలు కార్పొరేటర్లను నానా ఇబ్బందులు పెడుతున్నారన్నారు. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా ఇంతవరకు ఓపిక పట్టి సహనం వహిస్తున్నా… పార్టీ కోసం పని చేస్తే హత్యాయత్నం చేస్తారా…అని నిలదీశారు.

Read more RELATED
Recommended to you

Latest news