IPL 2023 : సచిన్ కూతురిని పెళ్లి చేసుకో..గిల్.. ఫ్యాన్స్‌ రచ్చ !

-

IPL-2023లో గుజరాత్, CSK, LSG, ముంబై ప్లే ఆఫ్స్ కు చేరుకున్నాయి. పాయింట్స్ టేబుల్ లో టాప్-2లో ఉన్న GT, CSK ఈ నెల 23న చెన్నైలో క్వాలిఫైయర్-1 మ్యాచ్ ఆడనున్నాయి. 3,4 స్థానాల్లో ఉన్న LSG, MI ఈ నెల 24న చెన్నైలో ఎలిమినేటర్ మ్యాచులో తలపడనున్నాయి. ఈనెల 26న క్వాలిఫైయర్-2, ఈనెల 28న ఫైనల్ మ్యాచ్ లు జరగనున్నాయి.

క్వాలిఫైయర్-1 లో ఓడిన జట్టు ఎలిమినేటర్ లో గెలిచిన జట్టుతో క్వాలిఫైయర్ లో తలపడుతుంది. అయితే.. RCB ప్లేఆఫ్స్ ఆశలపై నీళ్లు చల్లి తమను క్వాలిఫై చేసినందుకు ముంబై ఫ్యాన్స్… గిల్ కు థాంక్స్ చెబుతున్నారు. సచిన్ టెండూల్కర్ కూతురు సారాతో డేట్ చేశాడన్న రూమర్లను గుర్తు చేస్తూ… ‘ముంబైని గెలిపించావు. సారాను పెళ్లి చేసుకో. ఇదే మేము నీకు ఇచ్చే గిఫ్ట్. క్రికెట్ దేవుడికి నువ్వే సరైన అల్లుడివి’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా, గిల్ చక్కగా బ్యాటింగ్ చేశాడని సచిన్ ప్రశంసించిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news