గుడ్​న్యూస్.. బస్సు ఆలస్యమైతే టికెట్‌ డబ్బు వాపస్‌

-

ఆన్​లైన్ బస్సు టికెట్ బుకింగ్ సేవలు అందించే అభిబస్ మరో క్రేజీ న్యూస్ చెప్పి ప్రయాణికులను ఖుష్ చేసింది. ఇక్సిగో గ్రూపు అనుబంధ సంస్థ అయిన అభిబస్‌ కొత్తగా పలు సేవలనూ అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 25 మంది బస్‌ ఆపరేటర్లతో కలిసి అభిఅస్యూర్డ్‌ను ప్రారంభించింది. బస్సు రద్దు అయినప్పుడు టికెట్‌ విలువలో 150%, సౌకర్యాలు నచ్చకపోతే 100%, బస్సు ఆలస్యమైతే మొత్తం టికెట్‌ డబ్బులు వెనక్కి ఇవ్వనున్నారట. ఈ విషయాన్ని సంస్థ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ రోహిత్‌ శర్మ తెలిపారు.

తెలుగు రాష్ట్రాల్లో ఏడాదికి రూ.16,000 విలువైన బస్సు టిక్కెట్లు అమ్ముడవుతున్నాయని, ఇందులో ఆన్‌లైన్‌ టిక్కెట్ల వాటా రూ.300 కోట్ల వరకూ రోహిత్‌ శర్మ ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్‌ టికెట్‌ల మార్కెట్‌ మరింత విస్తరించేందుకు అవకాశాలున్నాయని పేర్కొన్నారు. 16వ వార్షికోత్సవం సందర్భంగా 16,000 మందికి రూ.16కే టికెట్‌ను అందించనున్నట్లు తెలిపారు. ఇది ఈ నెలాఖరు వరకూ అందుబాటులో ఉంటుందన్నారు. మరోవైపు అభిబస్‌ తన ప్రచారకర్తగా సినీ నటుడు మహేశ్‌ బాబును కొనసాగిస్తున్నట్లు వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news