IPL 2023 : చెన్నై, గుజరాత్ మ్యాచ్ లో ఫిక్సింగ్ చేశారా ?

-

IPL 2023 : క్వాలిఫైయర్-1 మ్యాచ్ లో గుజరాత్ పై చెన్నై 15 రన్స్ తేడాతో విజయం సాధించింది. చెన్నై నిర్దేశించిన 173 పరుగుల లక్ష్యాన్ని GT చేదించలేకపోయింది. గిల్ 42, రషీద్ 30 రన్స్ తో రాణించిన GT 157 రన్స్ కు ఆల్ అవుట్ అయింది. సీఎస్కే బౌలర్లలో చాహార్, తీక్షణ, జడేజా, పతిరన తలో 2 వికెట్లు, తుషార్ ఒక వికెట్ తీశారు.

ఈ మ్యాచ్ లో గెలవడంతో చెన్నై ఫైనల్ కు చేరగా, ఎలిమినేటర్ లో గెలిచే జట్టుతో GT క్వాలిఫైయర్-2 లో తలపడనుంది. అయితే.. CSK, GT మధ్య జరిగిన మ్యాచ్ పై నెట్టింట పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది. మ్యాచ్ పిక్స్ అయిందంటూ నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు. ట్విట్టర్ లో ‘#Fixing’ హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. GT బ్యాటర్లు పాండ్యా, మిల్లర్, తెవాటియా కావాలనే అవుట్ అయ్యారని, రుతురాజ్ పట్టిన విజయ్ శంకర్ క్యాచ్ లో బాల్ నేలకు తాకిన అవుట్ ఇచ్చారని ఆరోపిస్తున్నారు. సీఎస్ కే ఫైనల్ వెళ్లేందుకు ఇలా ప్లాన్ చేశారని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news