ఐపీఎల్ లో లీగ్ స్టేజ్ తర్వాత ఈ రోజు ఎలిమినేటర్ మ్యాచ్ ముంబై మరియు లక్నో జట్ల మధ్యన చెన్నై వేదికగా జరగనుంది. ఈ రోజు మ్యాచ్ లో గెలిచిన జట్టు క్వాలిఫైయర్ 2 లో గుజరాత్ టైటాన్స్ జట్టుతో ఆడనుంది. ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన జట్టే ఎక్కువగా గెలుస్తుందన్న నమ్మకంతో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. రాత్రి జరిగిన మ్యాచ్ లో కూడా మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై చేసిన 172 పరుగులను సమర్థవంతంగా కాపాడుకుని గుజరాత్ పై విజయం సాధించి సగర్వంగా ఫైనల్ కు చేరుకుంది. ఇప్పుడు ఈ మ్యాచ్ లో ఇరు జట్లు కూడా అన్ని విభాగాలలో బలంగా కనిపిస్తున్నాయి.
ఇక రోహిత్ శర్మ తన టీం ను కనీసం ఫైనల్ వరకు తీసుకెళ్ళగలడా చూడాలి. మరి ఎవరు గెలవనున్నారు అన్నది చూడాలి.