పశ్చిమ బెంగాల్ లోని తూర్పు మిడ్నాపూర్ లో ఓ బాణాసంచా కర్మగారంలో భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. గోపీనాథ్ పూర్ చందుకూరు గ్రామంలో అక్రమంగా నిర్వహిస్తున్న బాణాసంచా కర్మాగారంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
మృతుల కుటుంబాలకు 2.5 లక్షలు చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. అయితే ఈ ఘటనలో 12 మంది మరణించడంపై మమతా బెనర్జీ క్షమాపణలు చెబుతున్నట్లు తెలిపారు. ఈ ఘటన ఈ నెల 16వ తేదీన జరగగా.. నేడు మృతుల కుటుంబాలకు పరిహారం ఇచ్చే కార్యక్రమంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.