మహానాడులో చంద్రబాబు మహా నటుడు అని చురలకు అంటించారు మంత్రి ఉషా శ్రీ చరణ్. తెలుగు దేశం పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోకు మంత్రి ఉషాశ్రీ చరణ్ కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి ఉషాశ్రీ చరణ్ మాట్లాడుతూ… మహానాడులో చంద్రబాబు మహానటుడుగా మానిఫెస్టో విడుదల చేశారని ఫైర్ అయ్యారు. ఓ వైపు జగన్ సంక్షేమాన్నిఆపమని ప్రచారం చేస్తున్నారని వెల్లడించారు.
ఇంకో వైపు సంక్షేమ పథకాలు రద్దు చేస్తామంటారని… జగన్ చేస్తే కడుపుమంట.. వాళ్లు చెబితే బాగుంటుందని చెప్పారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే సమాధి కట్టడానికి పనికి రావ్ అంటున్నారని ఆగ్రహించారు. అమరావతిలో 50వేల ఇళ్ల పట్టాలు ఇవ్వడాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారని ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు మంత్రి ఉషా శ్రీ చరణ్. నారా లోకేష్ పాదయాత్రలో మంత్రులు, ఎమ్మెల్యేలను తిట్టుకుంటూ పోతున్నారన్నారు మంత్రి ఉషా శ్రీ చరణ్.