ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం 2023: స్మోక్ చేయడం వలన స్మోక్ చేసే వాళ్ళకి మాత్రమే కాదు పక్కన పీల్చే వాళ్లకి కూడా ఇబ్బందే చాలా మంది స్మోకింగ్ వలన రకరకాల సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది స్మోకింగ్ కారణంగా రకరకాల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం పొగాకు కారణంగా 8 మిలియన్ల మంది ప్రపంచవ్యాప్తంగా చనిపోతున్నారని తెలుస్తోంది. ఏడు మిలన్ల మందు ఏటా పొగాకుని తీసుకుని చనిపోతుంటే.. ఒకటి పాయింట్ రెండు మిలియన్ల మంది సెకండ్ హ్యాండ్ స్మోక్ వలన చనిపోతున్నారు.
సెకండ్ హ్యాండ్ స్మోక్ అంటే ఏంటంటే డైరెక్ట్ గా పొగాకుని తీసుకోవడం కాదు పొగాకు తీసుకున్న వాళ్ళ పక్కన ఉండి పీల్చడం. ఇలా సెకండ్ హ్యాండ్ స్మోక్ వల్ల ఒకటి పాయింట్ రెండు మిలియన్ల మంది చనిపోతున్నారు. స్మోక్ చేయడం మానేస్తే ఆరోగ్యంగా ఉండొచ్చు లేకపోతే రకరకాల సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రమాదకరమైన వ్యాధులు కూడా స్మోకింగ్ కారణంగా తలెత్తుతాయి.
స్మోకింగ్ మానేయాలనుకుంటే మీ ఇంట్లో, కార్లో, వర్క్ ఏరియాలో మీరు సిగరెట్లని తొలగించండి స్మోకింగ్ కి సంబంధించిన వస్తువులు అంటే మ్యాచ్ బాక్స్ వంటి వాటిని దూరంగా ఉంచుకోండి. అసలు స్మోకింగ్ వాసన మీ దడిదాపుల్లో లేకుండా చూసుకోండి. సిగరెట్ మానేయడం కోసం మీరు దాల్చిన చెక్క, టూత్ పిక్స్, స్ట్రా వంటి వాటిని ఉపయోగించండి ఇలా మీ మైండ్ ని స్మోకింగ్ నుండి డైవర్ట్ చేస్తే కచ్చితంగా స్మోకింగ్ అలవాటు నుండి బయటపడవచ్చు.