వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమంలో ఎంపి అవినాష్ రెడ్డి…ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రైతుల భాధలు వర్ణించలేనివని.. ఎంత చేసినా తక్కువే అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఐదో ఏడాది తొలి విడత ఇన్పుట్ సబ్సిడీ ఇస్తోంది వైసీపీ ప్రభుత్వం అని… విద్యా, వైద్యం, వ్యవసాయ రంగాల పై ప్రత్యేక దృష్టి పెట్టిందని వెల్లడించారు.
కోట్లాది రూపాయల నిధులు విడుదల చేస్తోంది..గతంలో మార్కెట్ యార్డులు అలంకార ప్రాయంగా ఉండేవని చెప్పారు. వైసిపి ప్రభుత్వంలో పంటల కొనుగోలు చేస్తూ రైతులకు అండగా నిలుస్తోంది..మార్కెట్ లో గిట్టుబాటు ధర రాని స్థితిలో ప్రభుత్వమే రైతు ఉత్పత్తులను కొనుగోలు చేస్తోందని అన్నారు. 2022 ప్రత్తి భీమా కు సంబంధించి ప్రతిపాదనలు పంపాము..950 కోట్లతో అర్ అండ్ అర్ ప్యాకేజీ ఇచ్చి గండి కోటను పూర్తి చేసి 26 టీ ఎంసీల నీటి ని నిలువ ఉంచుతోందని వెల్లడించారు ఎంపి అవినాష్ రెడ్డి.