మెడికల్ కాలేజీల అనుమతుల రద్దుపై స్పందించిన సుజనా చౌదరి

-

మెడికల్ కాలేజీల అనుమతుల రద్దుపై స్పందించిన సుజనా చౌదరి…చాలా కంపెనీలలో సంస్థల్లో తాను డైరెక్టరుగా ఉన్నానని వెల్లడించారు. 2014 లోనే మెడికల్ కాలేజీ డైరెక్టరుగా తప్పుకున్నానని… మెడికల్ కాలేజీలో పాలన వ్యవహారంలో నాకేం సంబంధం లేదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం స్టాండర్డ్స్ పెంచడం కోసం అనుమతులు రద్దు చేస్తే మంచిదేనని.. నేను టిడిపి కోవర్ట్ కాదని వెల్లడించారు.

బీజేపి జనసేన పొత్తులోనే ఉందని… టీడీపీతో పొత్తు అనేది అధిష్టానం చూసుకుంటుందని స్పష్టం చేశారు. ఏపీలో అవినీతి, ఆర్థిక అవతవకలు జరుగుతున్నాయని… ఇంత మెజార్టీ వచ్చిన జగన్ మోహన్ రెడ్డి ఇంత అధ్వాన్నమైన పాలన ఎందుకు చేస్తున్నారు..? అని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం ఏపీకి చట్ట ప్రకారం సహాయం అందిస్తుందని… అవినాష్ వ్యవహారంలో తాను స్పందించనన్నారు సుజనా చౌదరి. కోర్టులు ఇండిపెండెంట్ గా పని చేస్తాయి… టీడీపీ అనుకుంటే ముందస్తు ఎన్నికలు రావు మ్యానిఫెస్టోకు ముందస్తు ఎన్నికలకు సంబంధం లేదన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news