ఇటీవల సినిమా ఇండస్ట్రీలో హిట్ కాంబినేషన్ అంటే ఎవరికి వారు రేట్లు పెంచేస్తున్నారు. గత సినిమాల హిట్ కాంబినేషన్‌ను చూపించి ఎక్కువ రేట్లకు అమ్మేస్తున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరోలు సైతం తమ గత సినిమాల వసూళ్లు చూపించి భారీ రెమ్యునరేషన్లు డిమాండ్ చేసి నిర్మాతల జేబులకు చిల్లులు పెడుతున్నారు.
స్టార్ హీరోల సంగతి పక్కన పెడితే ఇప్పుడు గెస్ట్ రోల్స్ చేసే వాళ్లు కూడా కోట్లకు కోట్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ బాలీవుడ్ హీరో కూడా తెలుగు నిర్మాతలకు చుక్కలు చూపించాడు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ R R R. ఇద్దరు టాలీవుడ్ క్రేజీ హీరోలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తోన్న ఈ సినిమాను పాన్ ఇండియా సినిమాగా ప్రమోట్ చేస్తున్నారు.
ఈ సినిమాకు బాలీవుడ్లో కూడా క్రేజ్ తీసుకు వచ్చేందుకు అజయ్ దేవగణ్‌తో ఓ గెస్ట్ రోల్ చేయించాలని రాజమౌళి డిసైడ్ అయ్యాడట. అయితే అజయ్ కేవలం గెస్ట్ రోల్ చేసేందుకే ఏకంగా రు. 20 కోట్లు డిమాండ్ చేయడంతో నిర్మాత దానయ్యతో పాటు రాజమౌళి షాక్ అయ్యారని తెలిసింది. అయితే సినిమాకు పాన్ ఇండియా క్రేజ్‌తో పాటు బాలీవుడ్లో క్రేజ్ రావాల్సి ఉన్నందున అంత ఇచ్చేందుకు రాజమౌళి ఓకే చెప్పాడని అంటున్నారు.
ఇండస్ట్రీ వర్గాలు మాత్రం కేవలం గెస్ట్ రోల్‌కు అంత ఇవ్వడం ఏంటా ? అని ముక్కున వేలేసుకుంటున్నాయి. రు.250 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కే ఈ సినిమాలో అజయ్‌దేవగణ్ రోల్ ఎలా ? ఉంటుందో ? చూడాలి.