తెలంగాణ రాజకీయాల్లో సంచలనాలు చోటు చేసుకునేలా ఉన్నాయి. గత ఎన్నికల మాదిరిగా ఈ సారి ఎన్నికలు జరిగేలా కనిపించడం లేదు. గతంలో మాదిరిగా ఏకపక్షంగా ఫలితాలు వచ్చే అవకాశాలు లేవు. ఈ సారి ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీ మాత్రం జరిగేలా ఉంది. ఇప్పుడున్న పరిస్తితుల్లో ఎవరు లీడ్ లో ఉన్నారు..ఎవరు అధికారంలోకి వస్తారు అనేది చెప్పలేని పరిస్తితి. అంటే ఆ స్థాయిలో రాజకీయ యుద్ధం ఉందనే చెప్పాలి.
ఎన్నికల పోలింగ్ సమయంలో సైతం రాజకీయ సమీకరణాలు మారిపోయేలా ఉన్నాయి..ఓటర్లు మనసు ఎటువైపుకైనా తిరిగేలా ఉంది. అంటే ఆ స్థాయిలో రాజకీయ ఉంది. ఏది ఏమైనా గాని ప్రధాన పోరు మాత్రం ఎక్కువ స్థానాల్లో బిఆర్ఎస్-కాంగ్రెస్ పార్టీల మధ్య జరగనుంది. కొన్ని స్థానాల్లో త్రిముఖ పోరు..మరి కొన్ని స్థానాల్లో బిఆర్ఎస్-బిజేపిల మధ్య వార్ జరగడం ఖాయంగా కనిపిస్తుంది. అయితే టిడిపి, కమ్యూనిస్టులు, బిఎస్పి, షర్మిల పార్టీలు కొన్ని చోట్ల ఓట్ల చీల్చనున్నాయి. ఆ ఓట్ల చీలిక వల్ల ఎవరికి నష్టం, ఎవరికి లాభం జరుగుతుందో అర్ధం కాకుండా ఉంది.
అదే సమయంలో పాతబస్తీలో తిరుగులేని పార్టీగా ఉన్న ఎంఐఎం..రాష్ట్ర స్థాయిలో పోటీ చేస్తుందనే ప్రచారం ఉంది. ఇంతకాలం ఎంఐఎం పాతబస్తీలో గెలిచే 7 సీట్లు కాకుండా..ఆ చుట్టూ పక్కల పట్టున ఒకటి, రెండు చోట్ల మాత్రం పోటీ చేసేది. అయితే ఎంఐఎం గెలిచే 7 స్థానాల్లో బిఆర్ఎస్ పెద్ద పోటీ ఇవ్వదు. అలాగే బిఆర్ఎస్కు పరోక్షంగా మిగతా స్థానాల్లో ఎంఐఎం మద్ధతు ఇస్తుంది.
ఆయా స్థానాల్లో ముస్లిం ఓట్లు బిఆర్ఎస్కు పడతాయి. కానీ ఈ సారి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ రాష్ట్ర స్థాయిలో పోటీ చేస్తారనే ప్రచారం వస్తుంది. అదే జరిగితే బిఆర్ఎస్ పార్టీకి మాత్రం తిప్పలు తప్పవు. ముస్లిం ప్రభావిత స్థానాల్లో ఓట్లు భారీగా చీల్చి బిఆర్ఎస్ పార్టీకి డ్యామేజ్ చేస్తుంది. కానీ ఆ స్థాయి వరకు కేసిఆర్ రానివ్వరనే చెప్పాలి. ఎంఐఎంతో ఒప్పందం చేసుకునే ఎన్నికల బరిలో దిగే అవకాశాలు ఉన్నాయి. అలా చేస్తే బిఆర్ఎస్ సేఫ్..లేదంటే చిక్కులు తప్పవు.