తాడేపల్లి ప్యాలస్ లో సజ్జల ఒక బ్రోకర్ – నారా లోకేష్‌

-

ఏపీ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డిపై విరుచుకుపడ్డారు టీడీపీ పార్టీ నేత నారా లోకేష్‌. తాడేపల్లి ప్యాలస్ లో సజ్జల ఒక బ్రోకర్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు నారా లోకేష్‌. తాడేపల్లి ప్యాలస్ లో బ్రోకర్ ఒకడు ఉన్నాడు. వాడి పేరు సజ్జల. ఒళ్లు కొవ్వెక్కి కొట్టుకుంటున్నాడని నిప్పులు చెరిగారు.

మానసిక వైకల్యం గురించి మాట్లాడుతున్నాడు. తండ్రి శవం పక్కన ఉండగానే సీఎం అవ్వాలని సంతకాలు సేకరించిన జగన్ కి మానసిక వైకల్యం ఉంది ప్యాలస్ బ్రోకర్ అంటూ మండిపడ్డారు. సొంత బాబాయ్ ని లేపేసిన జగన్ కి మానసిక వైకల్యం ఉంది ప్యాలస్ బ్రోకర్ అని ఆగ్రహించారు. సొంత తల్లిని, చెల్లిని తరిమేసిన జగన్ కి మానసిక వైకల్యం ఉంది ప్యాలస్ బ్రోకర్ అని నిప్పులు చెరిగారు నారా లోకేష్‌.

Read more RELATED
Recommended to you

Latest news