20 ఏళ్ల తర్వాత భార్యతో టాప్ డైరెక్టర్ ప్రయోగం..?

-

ఒక‌ప్ప‌టి హీరోయిన్ ర‌మ్య‌కృష్ణ కుర్ర‌కారు గుండెల్లో డ్రీమ్ గ‌ర్ల్‌గా ఉండేది. అగ్ర‌క‌ధానాయ‌కుల‌తో న‌టించి ఒక వెలుగు వెలిగింది. పెళ్ళ‌యాక కొంత కాలం గ్యాప్ తీసుకున్న ఈమె  తరువాత తన వయసుకి తగిన ముఖ్యమైన పాత్రలను చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘బాహుబలి’ సినిమాలో ఆమె పోషించిన ‘శివగామి’ పాత్ర ఆమె స్థాయిని పెంచేసింది. ఇప్పుడు దర్శక నిర్మాతలు రమ్యకృష్ణను తమ సినిమాలకు ప్రత్యేక ఆకర్షణగా .. అదనపు బలంగా భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే త్వరలో రమ్యకృష్ణ .. కృష్ణవంశీ దర్శకత్వంలో ఒక సినిమాలో నటించనున్నట్టుగా ఫిల్మ్ నగర్‌లో ఒక వార్త షికారు చేస్తోంది. ‘నక్షత్రం’ తరువాత గ్యాప్ తీసుకున్న కృష్ణవంశీ, ఒక విభిన్నమైన కథతో త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్నాడట. ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం ఆయన రమ్యకృష్ణను ఎంపిక చేసుకున్నాడని అంటున్నారు. అదే నిజమైతే ‘శ్రీఆంజనేయం’ తరువాత, అంటే 15 ఏళ్ల తరువాత కృష్ణవంశీ దర్శకత్వంలో రమ్యకృష్ణ చేసే సినిమా ఇదే అవుతుంది. ఇక మ‌రి వీరిద్ద‌రి ప‌ర్స‌న‌ల్ లైఫ్ గ్యాప్ గురించి తెలిసిన విష‌య‌మే. కృష్ణవంశీ దాదాపు 20 సంవత్సరాల తరువాత తన సతీమణిని డైరెక్ట్ చేయబోతున్నాడు. మరి ఈ సినిమాతోనైనా మళ్ళీ కృష్ణవంశీ ఫామ్ లోకి వస్తారేమో చూడాలి. ఏమైనా కుటుంబ కథా చిత్రాలతో పాటు ప్రేమ కథా చిత్రాలు తియ్యడంలో కృష్ణ వంశీ’ శైలే వేరు. మ‌రి ఈ సినిమా క‌థ ఏంటి ర‌మ్య కృష్ణ పాత్ర ఎలా ఉండ‌బోతుంది అన్న విష‌యాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news