ర‌జ‌నీకాంత్ తో జ‌త‌క‌ట్ట‌నున్న‌ మంజు

-

కొంతకాలంగా రజనీకాంత్ ‘దర్బార్’ సినిమాతో బిజీగా వున్న విష‌యం తెలిసిందే. మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘దర్బార్’ సినిమా విడుదలకి సిద్ధమవుతూ ఉండగానే, రజనీ తదుపరి సినిమా పట్టాలెక్కడానికి సన్నాహాలు జరిగిపోతున్నాయి.

శివ దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఓ చిత్రాన్ని చేయనున్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఎంటర్ టైనర్ గా రూపొందే ఈ చిత్రంలో మంజు వారియర్ ను కథానాయికగా ఎంపిక చేసినట్టు సమాచారం. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ సన్‌ పిక్చర్స్‌ బ్యానర్‌ పై కళానిధి మారన్‌ నిర్మించనున్నారు.  ప్రస్తుతం సూర్య హీరోగా ఓ సినిమా తెరకెక్కిస్తున్న శివ, ఆ సినిమా పూర్తయిన వెంటనే రజనీకాంత్ సినిమా పనులు ప్రారంభించనున్నాడు. ప్రస్తుతం సెట్స్‌ మీద ఉన్న దర్బార్‌ సినిమాలో రజనీ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో నటిస్తున్నాడు. మాములు ప్రపంచానికి దూరంగా ఆధ్యాత్మికంగా గడపడానికి రజినీకాంత్…వీలు కుదిరినపుడల్లా.. హిమాలయాలకు వెళుతుంటారు. అక్కడ ఒత్తిడి నుంచి రిలీఫ్ అయ్యాక తిరిగొచ్చి కొత్త సినిమా స్టార్ట్ చేయనున్నారు. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మించనుంది.

Read more RELATED
Recommended to you

Latest news