ఎడిట్ నోట్: జగన్‌కు టర్నింగ్ పాయింట్..!

-

అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి జగన్ దూకుడుగానే పాలన చేస్తూ వచ్చారు. ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసిన తనదైన శైలిలో ప్రతిపక్షాలకు చెక్ పెడుతూ వచ్చారు. ప్రజా మద్ధతు తగ్గకుండా చూసుకుంటూ వచ్చారు. కానీ ఎందుకనో గత ఏడాది నుంచి కాస్త సీన్ రివర్స్ అయినట్లు కనిపించింది. వైసీపీ బలం తగ్గుతూ వస్తుందా? అనే అంశం కనిపించింది. ఇటు టి‌డి‌పి, జనసేన లు బలపడుతున్నాయనే విధంగా రాజకీయం జరిగింది. ఇదే తరుణంలో ఆ రెండు పార్టీలు కలుస్తున్నాయనే తరుణంలో ఇంకా వైసీపీకి చిక్కులు తప్పవని ప్రచారం మొదలైంది.

ఈ క్రమంలోనే ఊహించని విధంగా మూడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడం…ఇంకా భారీ ట్విస్ట్ ఏంటంటే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక సీటు ఓడిపోవడం..దీంతో వైసీపీకి సీన్ రివర్స్ అయిపోయిందని, ఇంకా జగన్ ఓటమి ఖాయమనే ప్రచారం మొదలైంది. అటు వివేకా హత్య కేసు, అప్పులు, ప్రతిపక్షాల దూకుడు..ఇవన్నీ వైసీపీకి ఇబ్బందిగా మారాయి. ఇంకా వైసీపీ పని అయిపోయిందనే విధంగా ప్రచారం వచ్చింది.

కానీ రాజకీయాల్లో సంక్షోభాలని సైతం తనకు అనుకూలంగా మార్చుకుని ముందుకెళ్లగల సత్తా జగన్‌కు ఉంది. ఇప్పుడు ఆయన అదే చేశారు. తనకున్న వ్యతిరేకతని నిదానంగా పోగొట్టుకుంటూ వచ్చేస్తున్నారు. ప్రజా మద్ధతు పెంచుకుంటున్నారు. ఇలాంటి తరుణంలోనే కేంద్రానికి రాష్ట్రం సాయం చేయడం పెద్ద టర్నింగ్ పాయింట్. కరెక్ట్ గా ఎన్నికల సమయం దగ్గరపడుతున్న తరుణంలో రెవెన్యూ లోటు కింద 10 వేల కోట్లు ఇవ్వడం, అటు పోలవరంకు 12 వేల కోట్లు ఇవ్వడం..రాష్ట్ర ఆర్ధిక పరిస్తితికి కాస్త ఊతమిచ్చాయి.

ఎన్నికల సమయంలో ఈ నిధులు రావడం జగన్‌కు బాగా ప్లస్ అవుతాయి. ఇప్పుడు టి‌డి‌పి శ్రేణుల్ బాధ కూడా అదే. ఎన్నికల ముందే కావాలని కేంద్రం నిధులు ఇచ్చిందని అంటున్నాయి. మొత్తానికి ఈ అంశం జగన్‌కు టర్నింగ్ పాయింట్ కానుంది. నెక్స్ట్ ఎన్నికల్లో గెలుపుకు బాటవేయనుంది.

Read more RELATED
Recommended to you

Latest news