అమెరికాలో ఇండో అమెరికన్ కి అరుదైన గుర్తింపు..!!!

-

ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలలో ఎక్కడో ఒక చోట భారతీయులు కొలువుదీరి ఉంటారు. భారతీయులు లేని దేశం బహుశా లేదనే చెప్పాలి. అన్ని దేశాలతో పోల్చితే భారతీయులు అత్యధికంగా ఉన్నది అగ్రరాజ్యం అమెరికాలోనే. ప్రస్తుతం అమెరికాలో ఉన్న విదేశీయులలో అత్యధికులు భారతీయులు కావడం విశేషం. అమెరికాలో స్థిర నివాసం ఏర్పటు చేసుకుని స్థానికంగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న భారతీయులు లెక్కకి మించి ఉన్నారు. ముఖ్యంగా అమెరికా రాజకీయాల్లో సైతం భారతీయుల హవా కొనసాగుతుంది.

ఒక్క రాజకీరంగంలో మాత్రమే కాదు. విద్య ,వైద్య , సాఫ్ట్ వేర్ రంగాలలో అమెరికాలో భారతీయులదే పైచేయి. తాజాగా, ప్రముఖ క్వీన్ ల్యాండ్ ఆసుపత్రిలో హెమటాలజీ, ఆంకాలజీ విభాగానికి కేరళ వాసి జేమ్ అబ్రహం చైర్మెన్ గా నియమితులు అయ్యారు. ఆయన 1921 లోనే ప్రజలకి సేవ చేయాలనే తలంపుతో ప్రజా వైద్యాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఇప్పుడు క్వీన్ ల్యాండ్ ఆసుపత్రిలో ఆసుపత్రిలో కొత్త చైర్మెన్ గా భాద్యతలు స్వీకరించనున్న జేమ్ ఉద్యోగులకి దిశానిర్దేశం చేయడం, రోగులకి సకాలంలో వైద్య సేవలు అందేలా చేయడం ముఖ్యమైన విధులు.

జేమ్స్ తన మెడికల్ డిగ్రీని కేరళాలోని కాలికట్ యూనివర్సిటీలో  పూర్తి చేశారు. అనంతరం అమెరికా వెళ్ళిన ఆయన అక్కడే స్థిరపడిపోయారు. మంచి డాక్టర్ గా అమెరికాలో గుర్తింపు తెచ్చుకున్న జేమ్స్ కి ఇప్పుడు ఈ అరుదైన గుర్తింపు రావడం ఎంతో సంతోషంగా ఉందని తోటి ఎన్నారైలు, ఎన్నారై సంఘాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news