బీజేపీలో టీడీపీ విలీనం… వైసీపీ నేత సంచలనం

-

ఏపీలో గత ఐదేళ్లలో అధికారంలో ఉన్న టిడిపి ప్రతిపక్షాలను ఓరేంజ్‌లో ఆదుకుంది. ప్రతిపక్ష పార్టీల నుంచి ఎవరైనా మాట్లాడితే చాలు టిడిపి నుంచి పదుల సంఖ్యలో నేతలు తీవ్రస్థాయిలో విరుచుకు పడేవారు. ఒకానొక దశలో వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు తమ పార్టీలో చేర్చుకున్న అప్పుడు ఆ పార్టీ పూర్తి డైలమాలో కి వెళ్ళిపోయింది. అలాంటి సంక్లిష్ట పరిస్థితుల నుంచి వైసిపి ఈరోజు ఏపీలో తిరుగులేని ఘన విజయం సాధించింది. ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సీఎం అయ్యారు. టిడిపి చరిత్రలోనే లేనంత తీవ్రంగా కేవలం ఇరవై మూడు సీట్లకు దిగజారిపోయింది.

ఇప్పుడున్న పరిస్థితుల్లో టిడిపిలో ఉండేందుకు ఆ పార్టీ సీనియర్ నేతలే కాదు, పార్టీ నుంచి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేల్లో చాలా మంది సైతం ఇష్టపడిన పరిస్థితి ఉంది. ఇప్పుడు వైసీపీ నేతలు అంతకుమించి టీడీపీ వాళ్లకు విమర్శల రుచి చూపిస్తున్నారు. తాజాగా వైసీపీ అధికార ప్రతినిధి మాజీ మంత్రి సి రామచంద్రయ్య తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. తమకున్న సమాచారం ప్రకారం చంద్రబాబు పై అనేక ఆరోపణలు ఉన్నాయని, అందుకే ఆయన మోదీని ప్రసన్నం చేసుకోవడానికి నానా తంటాలు పడుతున్నారని ఎద్దేవా చేశారు.

చంద్రబాబు ఇప్పటికే తన బ్రోకర్లను ఏజెంట్లను బిజెపి లోకి పంపించి లాబీయింగ్ చేస్తున్నారని కూడా రామచంద్రయ్య విమర్శించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు టీడీపీని బీజేపీ లో విలీనం చేయడం తప్ప వేరే మార్గం లేదని, లేదంటే ఆయన జైలుకు వెళ్లడం ఖాయమని కూడా చెప్పారు. పార్టీని విలీనం చేసి జైలు శిక్ష తప్పించుకుంటారా లేదా కేసుల్లో చిక్కుకుని జైలుకు వెళ్లడానికి కూడా చంద్రబాబు సిద్ధపడతారేమో అని ఎద్దేవా చేస్తూ మాట్లాడారు.

ఇక చంద్రబాబు మూడు రోజుల క్రితం జరిగిన పార్టీ అంతర్గత సమావేశంలో కేంద్ర ప్రభుత్వంతో అనవసరంగా పెట్టుకుని ఎన్నికల్లో ఓడిపోయామని, బలవంతుడైన మోడీ తో పెట్టుకోవడం తాను చేసిన పొరపాటు అన్న విషయాన్ని అంగీకరించినట్లుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పవన్ తో సైతం ఇబ్బంది లేకుండా ఉండేందుకు తాను గాజువాకలో కూడా ప్రచారం చేయలేదన్న విషయాన్ని సైతం ప్రస్తావించినట్టు కథనాలు వచ్చాయి. ఈ వ్యాఖ్యలు చేసిన రాజకీయవిశ్లేషకులు మీడియా వర్గాలు చంద్రబాబు తిరిగి బిజెపి జనసేన దగ్గరయ్యేందుకు సంకేతాలు పంపుతున్నారని చర్చిస్తున్నారు.

ఈ వ్యాఖ్యలపై అటు బీజేపీ నేతలు సైతం స్పందిస్తున్నారు చంద్రబాబుకు బిజెపిలోకి శాశ్వతంగా దారులు మూసుకుపోయాయి అని, ఆయన పచ్చి అవకాశవాదం ఏపీ బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ బుధవారమే విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వైసీపీ అధికార ప్రతినిధి రామచంద్రయ్య సైతం చంద్రబాబు కేసుల నుండి బయట పడాలంటే పార్టీని బిజెపిలో విలీనం చేయడం మినహా మరో ఆప్షన్ లేదని చెప్పటం రాజకీయంగా సంచలనంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news