సినిమాలా.. రాజ‌కీయాలా… క‌న్‌ఫ్యూజ‌న్‌లో ప‌వ‌న్‌..!

-

జనసేనాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన కెరీర్ పరంగా పూర్తి డైలమాలో ఉన్నట్లు కనబడుతోంది. పవన్ కళ్యాణ్ చివరిసారిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించిన అజ్ఞాతవాసి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేస్తాడు అన్న భారీ అంచనాలకు ముందు వచ్చిన ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఆ సినిమా అయ్యాక పవన్ మళ్లీ తాను సినిమాల్లో నటించ‌నని. ఫుల్ టైం పొలిటీషియన్ గా ఉంటానని పలుమార్లు ప్రకటనలు చేశారు. ఇక జనసేన పార్టీతో ఈ ఏడాది వేసవిలో జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేశారు. ఒక సినిమా స్టార్ గా అన్న చిరంజీవిని మించి రాజకీయాల్లో ప్రభావం చూపుతాడని అందరూ అనుకుంటే పవన్ పొలిటికల్ గా ఫ్లాప్ హీరో అయ్యాడు.

పవన్ పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో పాటు పార్టీ అధ్యక్షుడి హోదాలో తాను స్వయంగా పోటీ చేసిన గాజువాక, భీమవరం లలో సైతం పవన్ ఎమ్మెల్యేగా గెలవలేదు. ఆ పార్టీ తూర్పుగోదావరి జిల్లా రాజోలులో మాత్రమే విజయం సాధించింది. ఇక పార్టీ ఎన్నికల్లో ఓడిపోయాక అప్పుడప్పుడు బయటికి వస్తూ అధికార వైసిపిపై విమర్శలు చేస్తున్నాడు. వచ్చే ఐదేళ్ల వరకు పవన్ రాజకీయంగా చేయటానికి కనపడటం లేదు. ఏపీలో అధికార వైసిపి చాలా స్ట్రాంగ్ గా ఉండటం, మరో వైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ఏపీలో బలపడేందుకు రాజకీయంగా బ‌ల‌ప్ర‌ద‌ర్శ‌న‌కు దిగుతుండడంతో మిగిలిన పార్టీల ప్రభావం నామమాత్రంగా కనబడుతోంది.

ఈ నేపథ్యంలో పవన్ రాజకీయాల్లోకి కొనసాగడం కంటే మధ్య మధ్యలో సినిమాలు చేస్తూ తన అభిమానుల్లో జోష్ నింపేతేనే కరెక్ట్ అని ఆయన సన్నిహితులు ప‌వ‌న్‌ తమ అభిప్రాయం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఇక పవన్ సైతం ఆర్థికంగా నిలబడాలంటే మధ్యలో కొన్ని సినిమాలు చేయాల్సిందే అన్న నిర్ణయానికి సైతం వచ్చినట్టు తెలుస్తోంది. పవన్ ఎన్నికలకు ముందు నలుగురు అగ్ర నిర్మాతల‌ దగ్గర సినిమాలు చేస్తానని అడ్వాన్సులు పుచ్చుకున్నట్టు టాక్. ఇక రాజకీయంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో చేసేది కూడా లేకపోవడంతో మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన కూడా చేస్తున్నట్టు తెలిసింది.

ఈ క్రమంలోనే తనకు అత్యంత సన్నిహితులైన దర్శక, నిర్మాతలతో ఆయన టచ్ లోకి వెళ్లి కథలు అడుగుతున్నారని సమాచారం. కొన్ని ఆసక్తిగా ఉన్న కథలను సైతం పవన్ విన్నట్టు తెలుస్తోంది. పవన్ మధ్యలో ఎలా ఉన్నా ఇప్పుడున్న పరిస్థితుల్లో తిరిగి సినిమాల్లోకి వెళితేనే బెటర్ అని పవన్ అభిమానులు ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. రాజకీయపరమైన విమర్శలు ఎప్పుడూ ఉండేవే అని… వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని కూడా పవన్ అభిమానులు సూచిస్తున్నారు. అయితే పవన్ మాత్రం అటు తాను ఇచ్చిన మాటకు కట్టుబడి పూర్తి సమయం రాజకీయాలకే వెచ్చించాలా ? లేదా సినిమాలు చేసి అభిమానుల్లో జోష్ నింపాలా ? అని కాస్త సందిగ్ధంలో ఉన్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news