వికారాబాద్ జిల్లా పరిగి మండలం కాడ్లాపూర్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. గ్రామ శివారులో ఉన్న కుంటలో శిరీష (19) యువతి దారుణ హత్య జరిగింది. యువతి తలపై కత్తితో దాడి హత్య చేశారు గుర్తు తెలియని దుండగులు.
నిన్న రాత్రి పది గంటల సమయంలో ఇంటి నుండి బయటకు వచ్చిన యువతి.. అప్పటి నుండి కనిపించకుండా పోయింది. ఈ రోజు మధ్యాహ్నం కుంట అంచున యువతి దుస్తులను గుర్తించారు స్థానికులు. కుంటలోని నీటిలో యువతి మృతదేహం లభ్యం అయింది.
దీంతో పోలీసులకు సమాచారం అందించారు గ్రామస్థులు. ఇక ఘటనాస్థలాన్ని పరిశీలించిన పరిగి డిఎస్పీ కరుణసాగర్ రెడ్డి… యువతి మృత దేహం పై కత్తి గాట్లను గుర్తించారు. సమగ్ర విచారణ చేసి నిందితులను గుర్తించి శిక్షస్తామని ప్రకటన చేశారు డిఎస్పీ కరుణసాగర్ రెడ్డి.