మరోసారి డీజే టిల్లు పాటకు స్టెప్పులేసిన మంత్రి మల్లారెడ్డి

-

రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అంటే యూత్​లో సూపర్ క్రేజ్ ఉంది. ఎందుకంటే ఆయన యూత్​కి కనెక్ట్ అయ్యేలా మాట్లాడతారు. ఇక సందర్భం వచ్చినప్పుడల్లా ఆయన తనలో ఉన్న డ్యాన్సర్​ను బయటకు తీస్తుంటారు. తన కాలేజ్ ఉత్సవాల్లో.. పార్టీ సంబురాల్లో అప్పుడప్పుడు హుషారుగా స్టెప్పులేస్తుంటారు. ఇప్పటికే పలుమార్లు మల్లారెడ్డి డ్యాన్స్ వీడియోలు వైరల్ అయ్యాయి. సోషల్ మీడియాలోనూ మల్లారెడ్డి క్రేజ్ మామూలుగా లేదు. ఇప్పుడు మరోసారి మంత్రి మల్లారెడ్డి తన డ్యాన్స్​తో సందడి చేశారు. ప్రస్తుతం ఈ లేటెస్ట్ వీడియో కూడా బాగా వైరల్ అవుతోంది. ఇంతకీ ఆయన ఈసారి ఏ పాటపై స్టెప్పులు వేశారో తెలుసా..?

డీజే టిల్లు పాటకు మంత్రి మల్లారెడ్డి మరోసారి దుమ్ములేపే స్టెప్పులేశారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన 2కే రన్ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి డ్యాన్స్ అదరగొట్టారు. హైదరాబాద్ పీర్జాదిగూడలో నిర్వహించిన తెలంగాణ రన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన డీజే టిల్లు పాటకు స్టేజ్​పై స్టెప్పులేశారు. 2కే రన్​కు వచ్చిన రన్నర్లను ఉత్సాహపరిచారు.

 

Read more RELATED
Recommended to you

Latest news