ఏపీ సీఎం జగన్ పై దాడి కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. సీఎం జగన్ పై దాడి కేసుపై ఇవాళ NIA కోర్టులో విచారణ జరిగింది. నిందితుడు శ్రీనివాస్ తో పాటు ఇరుపక్షాల లాయర్లు కోర్టుకు హాజరయ్యారు.
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు నిందితుడు శ్రీనివాసు లేఖ రాశాడని శ్రీను తరపు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. ఆ లేఖను ఇంగ్లీషులోకి ట్రాన్స్ లేట్ చేసి పంపిస్తామని శ్రీను తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ‘1610రోజులుగా బెయిల్ లేకుండా జైల్లోనే ఉంటున్నాను. నాకు విముక్తి కల్పించండి’ అని శ్రీను లేఖలో పేర్కొన్నాడు.