‘ఆదిపురుష్’ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతో తెలుసా…?

-

ఎన్నో అంచనాలు.. మరెంతో నిరాశ.. మళ్లీ చిగురించిన ఆశల నడుమ ఎట్టకేలకు రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా థియేటర్లలో విడుదలైంది. కృతి సనన్​, దేవదత్త నాగే, సైఫ్​ అలీఖాన్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా జూన్​ 16న భారత్​తో సహా ఓవర్సీస్​లోనూ రిలీజైంది. భారీ అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 7,500 స్క్రీన్లలో రిలీజైన ఈ సినిమా ప్రస్తుతం మంచి టాక్ సొంతం చేసుకుంది. కొన్నిచోట్ల నెగిటివ్ టాక్ ఉన్నా.. ఈ సినిమాలో నటించేందుకు ప్రభాస్ చూపించిన ధైర్యం.. వీఎఫ్ఎక్స్ టీమ్ కృషి.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్​ను చూసి ప్రేక్షకులు కాస్త ఆదరిస్తున్నారు.

అయితే ఈ సినిమా మొదటి రోజు మాత్రం బాక్సాఫీస్​ వద్ద కలెక్షన్స్‌ల పరంగానూ దూసుకెళ్లింది. ఇక తొలి రోజు సుమారు రూ. 150 కోట్ల మార్క్‌ను అందుకుందని ట్రేడ్​ వర్గాల టాక్​. మరి కొన్ని లెక్కల ప్రకారం ఈ సినిమా నైజాంలో రూ.50 కోట్లు, సీడెడ్​లో రూ17.5 కోట్లు, వైజాగ్​లో రూ.12.5 కోట్లు, వెస్ట్​- రూ.7 కోట్లు, ఈస్ట్- రూ.8 కోట్లు, కృష్ణా- రూ.7.5 కోట్లు, గుంటూరు- రూ.9 కోట్లు, నెల్లూరు- రూ. 4 కోట్ల కలెక్షన్లు రాబట్టినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news