జనగామ రిటైర్డ్ ఎంపీడీవో రామకృష్ణ దారుణ హత్య..

-

జనగామ రిటైర్డ్ ఎంపీడీవో రామకృష్ణ దారుణ హత్య గురయ్యాడు.. చంపక్‌హిల్స్ శివారులో రామకృష్ణను హత్య చేసింది సుపారీ గ్యాంగ్. సుపారీ గ్యాంగ్ హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడి అయింది. భూవివాదంలో రామకృష్ణను హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు.

ఇక ఆ ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. మాజీ ఎంపీడీవో హత్యకు భూతగాదాలు, ఆర్‌టీఐ సమాచార సేకరణే కారణంగా భావిస్తున్నారు కుటుంబ సభ్యులు.అంతేకాదు… జనగామ జడ్పీ వైస్‌ చైర్మన్‌ భర్తపై మృతుని కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ కేసుపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news