ఏంటీ.. రకుల్ కి అప్పుడే రెండుసార్లు పెళ్లయిందా..?

-

పంజాబీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇకపోతే సాధారణంగా సినీ సెలబ్రిటీలు తమ ప్రేమ వ్యవహారాలను చాలా రహస్యంగా పాటిస్తూ ఉంటారు. ముఖ్యంగా లవ్ లైఫ్ గురించి బయటకు స్పందిస్తే మీడియా అటెన్షన్ తో పాటు సోషల్ మీడియాలో కూడా అనవసరమైన గాసిప్స్ పుట్టుకొస్తాయని భయపడుతూ రహస్యంగా వాటిని దాచేస్తారు. అయితే పంజాబీ ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం ఇందుకు పూర్తిగా విభిన్నం. బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీనీతో తన ప్రేమ వ్యవహారం గురించి 2 యేళ్ళ క్రితమే ఇంస్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది . ముఖ్యంగా ఆ రహస్య ప్రేమలపై తమకు నమ్మకం లేదని ప్రస్తుతం తన జీవితంలో అత్యంత సంతోషకరమైన దశ నడుస్తోందని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కూడా వెల్లడించింది ఈ ముద్దుగుమ్మ.

ఇకపోతే సెలబ్రిటీలు ప్రేమ వ్యవహారాలను దాచడం అన్నది అంత సులభం కాదు. అందుకే నేను ముందే చెప్పేశాను. నా పెళ్లి గురించి చాలా వార్తలు వస్తున్నాయి. గత డిసెంబర్ నెలలో రహస్యంగా మ్యారేజ్ చేసుకున్నానని వదంతులు సృష్టించారు. ఫిబ్రవరిలో కూడా పెళ్లి జరిగిపోయిందంటూ వార్తలు సృష్టించారు. ఇక దీన్ని బట్టి చూస్తే ఇలా రెండుసార్లు నాకు పెళ్లి జరిగిపోయినట్లే అంటూ ఆమె చమత్కరించింది.

ఇకపోతే రకుల్ ప్రీత్ సింగ్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈమె కమలహాసన్ నటిస్తున్న ఇండియన్ 2 సినిమాలో అవకాశం దక్కించుకుంది. మరొకవైపు ఆయలాన్ అనే చిత్రంలో కూడా ఈ ముద్దుగుమ్మ నటిస్తోంది. మొత్తానికైతే సోషల్ మీడియాలో తన ప్రేమ పెళ్లి పై వస్తున్న వార్తలకు బ్రేక్ పడేలా చేసిందని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news