అరాచకంగా పాలించిన చంద్రబాబును పవన్ కళ్యాణ్ గుడ్డలిప్పి కొట్టాడా..? – పేర్ని నాని

-

తనకు ప్రాణహాని ఉందంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సొల్లు కబుర్లు చెబుతున్నాడని మండిపడ్డారు మాజీ మంత్రి పేర్ని నాని. ఒకవేళ పవన్ కళ్యాణ్ కి ప్రాణహాని ఉంటే అది చంద్రబాబు వల్లే ఉంటుందని అన్నారు. దీనిపై ఏనాడైనా పవన్ కళ్యాణ్ పోలీసులకు చెప్పాడా..? అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ సినిమాలలో తప్ప బయట ఎవరినీ కొట్టలేడని ఎద్దేవా చేశారు. ఒకవేళ కొడితే తన దగ్గర పనిచేసే సిబ్బందిని తప్ప ఎవరినీ కొట్టలేడని అన్నారు.

గతంలో అరాచకంగా పాలించిన చంద్రబాబును పవన్ కళ్యాణ్ గుడ్డలిప్పి కొట్టాడా..? అని కీలక వ్యాఖ్యలు చేశారు. అవినీతిపరుడని ఆయనే ఆరోపించిన లోకేష్ ని కొట్టగలిగాడా..? అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ ది రౌడీ మనస్తత్వం అని.. అందుకే అలా మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన చంద్రబాబుతో పొత్తు అనగానే పవన్ వెనకాల కాపులు తిరగడం మానేశారని అన్నారు. సీఎం జగన్ ని ఎదుర్కోవడం పవన్ కళ్యాణ్ వల్ల కాదన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news