యుపీలో పెరిగిన వేడిగాలుల తీవ్రత సీఎం యోగీ ఉన్నత స్థాయి సమీక్ష

-

దేశ వ్యాప్తంగా వేడిగాలుల తీవ్రత పెరిగిపోతోంది. టైమ్‌కి వస్తాయనుకున్న రుతుపవనాలు ఆలస్యమయ్యాయ్‌.పవనాలు నెమ్మదిగా కదులుతుండటంతో దేశమంతా ఈ పవనాలు వ్యాపించడానికి మరింత సమయం పట్టేలా ఉంది.దీంతో దేశంలోని పలు రాష్ర్ట్లాల్లో వేడిగాలుల తీవ్రత రోజురోజుకీ పెరుగుతోంది.ఈ నేపథ్యంలో ఉత్తరాది రాష్ర్టాల్లో ప్రభుత్వాలు అలెర్ట్‌ అయ్యాయి.ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌ కూడా అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.గత కొన్ని రోజులుగా రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో వేడిగాలుల ప్రభావం కనిపిస్తోందన్న ఆయన ప్రజలు వడదెబ్బకు గురికాకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.పశువులు,వన్యప్రాణుల రక్షణ కోసం ఏర్పాట్లు చేయాలి” అని యోగి అన్నారు.

యూపీకి రుతుపవనాలు మరింత ఆలస్యమవుతాయని చెప్పిన యోగీ…,వడదెబ్బ లక్షణాలు, నివారణపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.అనారోగ్య ససమ్యలు తలెత్తితే ప్రతి ఒక్కరికీ వెంటనే వైద్య సదుపాయాలు అందించాలని చెప్పారు. వేడిగాలుల బారిన పడిన వారికి వెంటనే ఆస్పత్రులు/మెడికల్‌ కాలేజీల్లో చికిత్స అందించాలని సీఎం సూచించారు.ప్రజలు అస్వస్థతకు గురైతే వైద్యారోగ్య శాఖ అప్రమత్తంగా ఉంటూ తక్షణమే వైద్య సదుపాయం కల్పించాలన్నారు. రాష్ట్ర వాతావరణ సూచనపై రిలీఫ్ కమిషనర్ రోజువారీ బులెటిన్ విడుదల చేయాలని ఆయన అన్నారు.

అన్ని పురపాలక సంఘాలు,గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ స్థలాల్లో వాటర్‌ కియోస్క్‌లు ఏర్పాటు చేయాలని కోరారు.మార్కెట్‌లోని పలు చోట్ల, ప్రధాన రహదారులపై తాగునీటి ట్యాంకర్‌లను సిద్ధంగా ఉంచాలన్నారు.అన్ని మునిసిపల్ బాడీలు మరియు గ్రామీణ ప్రాంతాల్లో బహిరంగ ప్రదేశాల్లో వాటర్ కియోస్క్‌లు నిర్మించాలని ఆయన అధికారులను ఆదేశించారు. దీనికోసం సామాజిక,ధార్మిక సంస్థల సహకారం కూడా తీసుకోవాలని సూచించారు. నిత్యం రోడ్లపై నీళ్లు చల్లాలన్నారు.ఆవులు, కుక్కలు, జంతువులకు బహిరంగ ప్రదేశాల్లో నీడతోపాటు తాగునీటి సౌకర్యం కల్పించేలా ఏర్పాట్లు చేయాలని స్పష్టమైన ఆదేశాలిచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news