దగ్గుమందుతో కామెరూన్​లో చిన్నారుల మృతి.. భారత్‌పైనే అనుమానాలు

-

భారత్​లో కొన్ని కంపెనీలు తయారు చేసిన దగ్గు మందును ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ బ్యాన్ చేసింది. ఈ దగ్గు మందు వల్ల పలు దేశాల్లో చిన్నారులు మృత్యువాత చెందుతున్నారన్న ఆరోపణలతో ఈ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దాదాపు 12 రకాల దగ్గు సిరప్​లను నిషేధించారు. అయితే తాజాగా మధ్య ఆఫ్రికా దేశమైన కామెరూన్‌లో గత కొద్ది నెలలుగా చిన్నారులు వరుసగా ప్రాణాలు కోల్పోతున్నారు. వీరి మరణాలకు దగ్గుమందే కారణమని అక్కడి అధికారుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

అయితే అది భారత్‌లో తయారైన ఔషధమనే అనుమానాలు తాజాగా వ్యక్తమవుతున్నాయి. ఈ దగ్గుమందు తయారీ లైసెన్స్‌ నంబరు.. భారత్‌కు చెందిన ఓ సంస్థతో సరిపోలినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఓ ఆంగ్ల జాతీయ మీడియా కథనం వెల్లడించింది. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ నిషేధించిన మందులు ఇంకా సరఫరా చేస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ఇంకా భారత్ నుంచి ఎలాంటి స్పందన లేదు.

Read more RELATED
Recommended to you

Latest news