మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. టాలీవుడ్ అందాల రాక్షసి లావణ్య త్రిపాఠికి ఇటీవలే నిశ్చితార్థమైన విషయం తెలిసిందే. ఇప్పటికే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే లావణ్య ఎంగేజ్మెంట్ తర్వాత మరింత యాక్టివ్ అయ్యారు. ఇక తరచూ తన పర్సనల్ విషయాలను ఫ్యాన్స్ చేసుకుంటున్నారు. వ్యక్తిగత, వృత్తిపరమైన అప్‌డేట్‌లను ఎప్పటికప్పుడు ఆమె అభిమానులతో పంచుకుంటున్నారు.
ఈ క్రమంలోనే తన ఫోన్ వాల్‌పిక్‌ను లావణ్య తాజాగా ఇన్‌స్టాలో షేర్ చేశారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో పలు ప్రత్యేక సందర్భాల్లో దిగిన పలు ఫొటోలను ఉపయోగించి ఈ వాల్‌పిక్‌ను ఆమె సిద్ధం చేశారు. అయితే, ఈ పిక్‌లో తనకు కాబోయే భర్త వరుణ్ తేజ్ ఫొటోని సైతం లావణ్య పొందుపరిచారు. ఓ వెకేషన్‌లో వరుణ్‌తో కలిసి దిగిన ఫొటోని.. వాల్‌పిక్ వేదికగా అభిమానులతో షేర్ చేసుకున్నారు. ‘మై లవ్స్.. డ్రీమ్ బిగ్గర్’ అంటూ ఆమె క్యాప్షన్ జత చేశారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ‘క్యూట్ జోడీ’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.