రోడ్డు మీద బ్రేక్ లైన్ తర్వాత సాలిడ్ లైన్ ఉంటే.. దాని అర్ధం ఇదే..!

-

మనం రోడ్డు మీద ట్రావెల్ చేస్తున్నప్పుడు మనకి రోడ్డు మీద గీతలు కనబడుతూ ఉంటాయి చాలా మందికి ఎందుకు ఈ గీతలు రోడ్డు మీద ఉన్నాయి అనేది తెలీదు. ముఖ్యంగా హైవేల మీద వెళ్ళినప్పుడు తరచుగా బ్రేక్ లైన్స్ కనబడతాయి. రోడ్డు మధ్య లో గ్యాప్ తో వైట్ లైన్ మనకి కనబడుతూ ఉంటుంది. కొన్నిచోట్ల బ్రేక్ లైను ఉండాల్సిన చోట వైట్ స్ట్రెయిట్ లైన్ ఉంటుంది అయితే ఎందుకు తెల్లని స్ప్రైట్ లైన్ ని రోడ్డు మీద పెడతారు దానికి కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం.

రోడ్డుమీద బ్రేక్ లైన్స్ ఉంటాయి కానీ సడన్ గా ఒక స్ట్రైట్ లైన్ కనబడుతూ ఉంటుంది ఇలా కనుక రోడ్డు మీద ఉందంటే బండి నడిపే వాళ్ళు కేవలం వాళ్లు ఉన్న దారి లోనే నడపాలని లైన్ మారడానికి ట్రై చేయకూడదని దాని వెనుక అర్థం. ఈ విషయం మీద అవగాహన కల్పించడానికి పోలీసులు ఈ విషయాన్ని ట్వీట్ చేశారు. పోలీసులు ట్వీట్లో ఈ లైన్ ఎందుకు ఉంది అని ప్రశ్నించారు.

సైబరాబాద్ ట్విట్టర్ పేజీ నుండి పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ కి నెటిజన్లు ఇంచుమించుగా సరైన సమాధానాన్ని ఇచ్చారు. ఒక యూజర్ అయితే సాలిడ్ లైన్ ఉంటే లైన్ క్రాస్ చేయలేము అని జవాబు ఇవ్వగా ఓవర్టేక్ చేయకూడదని ఇంకొకరు కామెంట్ చేశారు అలానే మరొక యూజర్ అయితే లైన్ మారకూడదు అని సమాధానం ఇచ్చారు. ఇలా ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు కామెంట్లు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news