జగ్గారెడ్డి : సొంత పార్టీ నేతలపైనే దుష్ప్రచారం… మా దరిద్రం

-

తెలంగాణ కాంగ్రెస్ లోకి కీలక నేతలు చేరుతుండడం హర్షించదగిన విషయం అని చెప్పాలి. రెండు రోజుల నుండి కీలక కాంగ్రెస్ నేతలు ఢిల్లీ లో రాహుల్ గాంధీతో భేటీలో ఉన్నారు. కాగా కాంగ్రెస్ నేత మాజీ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గురించి పార్టీని వీడనున్నారన్న వ్యాఖ్యలు వినిపించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై జగ్గారెడ్డి స్పందించారు.. పార్టీలో కొందరి నేతలు అసంతృప్తితో ఉన్న విషయం వాస్తవమే. కానీ దీనికి చాలా కారణాలు ఉన్నాయని జగ్గారెడ్డి అన్నారు. కొందరు మా పార్టీలోనే మా నేతలపైనా దుష్ప్రచారాలు చేస్తున్నారని ఆవేదన చెందారు. నిజంగా ఇది మా పార్టీకి పట్టిన దరిద్రం అన్నారు.

ఈ విషయం పైన సీరియస్ గా చర్చిస్తామని జగ్గారెడ్డి అన్నారు. ఈ రోజు రాహుల్ గాంధీతో జరిగే భేటీలో ఒక కీలక నిర్ణయం తీసుకుంటామని జగ్గారెడ్డి చెప్పారు.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news