దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయిందని సంచలన వ్యాఖ్యలు చేశారు పరకాల ప్రభాకర్. సోమజిగూడా ప్రెస్ క్లబ్ నుంచి పరకాల ప్రభాకర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై…దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయిందని నిర్మలా సీతారామన్ పై వ్యాఖ్యలు చేశాడు పరకాల ప్రభాకర్. నేను జన్యున్ సెక్యులర్ అని… కేంద్రంలో ఒక్క ముస్లిం మంత్రి లేడని నిప్పులు చెరిగారు. ఉత్తర్ ప్రదేశ్ లో ఒక్క ముస్లిం ఎమ్మెల్యే లేడని.. దేశ ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలిపోయిందని ఫైర్ అయ్యారు.
దేశం మొత్తం కేవలం 25శాతం వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిందని… దేశంలో అత్యంత ఎక్కువ ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఎంతమంది, ఈదేశంలో ఎంతమంది వలస కార్మికులు చనిపోయారో మోడీ ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉన్నాయా? అని నిలదీశారు. మన దేశంలో 25శాతం పౌష్టికాహారం దొరకక బలహీనమైపోతున్నారని.. చైనా దేశంలో చొరబడినా, శవాలు గంగా నదిలో తెలినా, ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలినా, నిరిద్యోగం తాండవిల్లుతున్నా…ఇవేమీ పట్టించుకోకుండా మతం ముసుగులో కొట్టుమిట్టాడుతున్నామని చెప్పారు. ఈ దేశాన్ని విచ్చినం చేసే విధంగా భావజాలం పెరిగిపోతుందని ఆగ్రహించారు.