టీడీపీ మోసకారి పార్టీ : మంత్రి మెరుగు నాగార్జున

-

ఈ రోజు నుండి ఆంధ్రప్రదేశ్ లో సీఎం జగన్ ప్రభుత్వం కొత్తగా తీసుకు వచ్చిన జగనన్న సురక్ష ను ప్రజాప్రతినిధులు ప్రమోట్ చేస్తున్నారు. తాజాగా మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ జగనన్న సురక్షను ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ జగనన్న సురక్ష 15004 సచివాలయాలు పరిధిలో అమలులోకి వచ్చినదని మంత్రి తెలిపారు. ఆ తర్వాత గత ప్రభుత్వం గురించి తనదైన శైలిలో విమర్శలు చేశారు మంత్రి మేరుగు నాగార్జున. ఈయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఉన్న టీడీపీని ప్రజలు సాయం కావాలని అడిగినా ఎవ్వరూ పట్టించుకోలేదన్నారు, మానిఫెస్టోలో మాత్రమే ఇష్టం వచ్చినట్లు రాసుకుని.. అధికారంలోకి వచ్చాక నెరవేర్చకుండాఆ ప్రజలను మోసం చేశారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు మంత్రి నాగార్జున.

ఇప్పుడు మా ప్రభుత్వం ప్రజలకు అవసరమైన అన్ని సమస్యలను ఇంటింటికీ వెళ్లి మరీ అడిగి తెలుసుకుని పరిష్కరిస్తున్నామన్నారు. ఇప్పటికే మేము మానిఫెస్టోలో చెప్పినవి 99 శాతం చేశామని చెప్పారు మంత్రి.

Read more RELATED
Recommended to you

Latest news