“బోయపాటి – రామ్” మూవీ నుండి బ్లాక్ బస్టర్ అప్డేట్…

-

రామ్ మరియు బోయపాటి కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. బోయపాటి వరుసగా బ్లాక్ బస్టర్ హిట్ లను అందుకుంటుంటే రామ్ మాత్రం తన గత చిత్రాలు రెడ్ మరియు ది వారియర్ సినిమాలు ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయాయి. దానితో ఇప్పుడు రామ్ కు ఒక మంచి విజయం ఖచ్చితంగా కావాలి.. అందుకే… బోయపాటి లాంటి సూపర్ హిట్ డైరెక్టర్ తో జత కట్టాడు. కాగా ఈ సినిమా నుండి ఒక మంచి అప్డేట్ ను చిత్ర బృందం విడుదల చేయనుంది. అందుతున్న సమాచారం ప్రకారం జులై 3వ తేదీ ఉదయం 11 .25 గంటలకు టైటిల్ గింప్స్ వీడియోను విడుదల చేయనున్నామని ఒక పోస్టర్ ను విడుదల చేశారు. ఇందులో రామ్ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటించనుంది. కాగా ఈ సినిమాను సెప్టెంబర్ వ తేదీన విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ఈ సినిమా అయినా రామ్ కు విజయాన్ని అందించి అభిమానులకు జోష్ ను ఇస్తుందా తెలియాలంటే మరో మూడు నెలల వరకు వెయిట్ చేయాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news