అల్లురిని దైవాంస సంభూతుడిగా భావిస్తా : సీఎం కేసీఆర్

-

అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమం ఈ రోజు హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరగనుంది. సాయంత్రం జరిగే కార్యక్రమానికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ కూడా పాల్గొననున్నారు. ఈ సందర్భంగా దేశం కోసం అల్లూరి చేసిన త్యాగాన్ని సీఎం కేసీఆర్‌ స్మరించుకొన్నారు. దేశ స్వాతంత్య్రం కోసం, స్వయం పాలన కోసం తన ప్రాణాలను పణంగా పెట్టి బ్రిటిష్‌ పాలకులతో పోరాడిన అల్లూరి సీతారామరాజు త్యాగం గొప్పదని, స్వాతంత్య్రోద్యమ చరిత్రలో వారి అమరత్వం అజరామరమని పేర్కొన్నారు.

Telangana CM KCR slams Budget 2022, calls it 'golmaal' - India Today

ఈ కార్యక్రమంలో మాట్లాడిన తెలంగాణ సీఎం కేసీఆర్.. అల్లురిని దైవాంస సంభూతుడిగా భావిస్తానన్నారు.
26 ఏళ్ల అతి చిన్న వయసులోనే రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన అల్లురి సీతారామరాజు భరత జాతి గర్వించదగ్గ మహనీయుడు అని కొనియాడారు. ఎక్కడైతే పీడన, దోపిడీ ఉంటుందో అక్కడే మహానీయులు ఉద్భవించి ఉద్యమిస్తారని అన్నారు. అల్లురి ఆ కోవకు చెందిన వాడేనన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news