నిన్న మీడియాతో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మాట్లాడిన చిట్ చాట్ ఆడియో లీక్.
తరువాత నేను మాట్లాడలేదు అని అడ్డంగా దొరికిన రఘునందన్ రావు. https://t.co/tbCKOXpdLv pic.twitter.com/c4zZTIdQDc
— Telugu Scribe (@TeluguScribe) July 4, 2023
నిన్న తెలంగాణ దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఢిల్లీలో మాట్లాడుతూ అధిష్టానం పై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈయన నిన్నటి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మరియు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా లను ఉద్దేశించి తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు. నేను 10 సంవత్సరాల నుండి పార్టీ కోసం ఎంతో కష్టపడ్డాను నాకు ఏదో ఒక ముఖ్య పదవి ఇవ్వండి అంటూ మాట్లాడారు. అనంతరం మీడియా సమావేశంలో సాయంత్రం మాట్లాడుతూ నేను తమాషాలు మాట్లాడిన మాటలను మీడియా సంస్థలు వక్రీకరించి రాశారు అంటూ కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు రఘునందన్ రావు…కాగా ఇప్పుడు నిన్న బీజేపీ పై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఆడియో సోషల్ మీడియాలో లీక్ అయ్యి సంచలనం సృష్టించింది. మరి ఈ ఆడియో లీక్ మీద రఘునందన్ రావు అధిష్టానానికి ఏమి సమాధానం చెబుతాడో చూడాలి.
అయితే ఇప్పటికీ రఘునందన్ పై బీజేపీ అధిష్టానం వేటు వేసింది అని వార్తలు వచ్చిన నేపథ్యంలో వాస్తవానికి ఎటువంటి చర్యలు ఈయనపై తీసుకోనున్నారు అన్నది తెలియాల్సి ఉంది.