రాక్షసుడిగా రానున్న రానా.. రెండు భాగాలుగా

-

నేనే రాజు నేనే మంత్రి తర్వాత రానా దగ్గుబాటి, దర్శకుడు తేజ రెండోసారి కలిసి ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని తేజ డైరెక్టర్ గా దగ్గుబాటి అభిరాం హీరోగా తెరకెక్కిన అహింస సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ సినిమాను ఆగస్ట్‌లో అధికారికంగా షూటింగ్‌ ప్రారంభడానికి ప్రణాలికలు సిద్దం చేస్తుండగా ఆ సినిమా గురించి మరో ఆసక్తికరమైన అప్‌డేట్ తెర మీదకు వచ్చింది. అదేమంటే టాలీవుడ్ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మేరకు ఈ సినిమాకి రాక్షస రాజా అనే టైటిల్ పెట్టారని, ఈ సినిమాను భారీ స్థాయిలో చిత్రీకరించనున్నారని తెలుస్తోంది. అంతే కాదు రానా నటించబోయే ఈ సినిమాను రెండు భాగాలుగా చిత్రీకరించి రెండు భాగాలుగా విడుదల చేయనున్నట్టు టాక్ వినిపిస్తోంది.

Rana Daggubati reveals struggle with partial blindness and kidney  transplant | Telugu Movie News - Times of India

ఈ ప్రాజెక్టు వచ్చేనెల నుంచి సెట్స్ పైకి వెళ్లే దిశగా సన్నాహాలు చేసుకుంటున్నారని చెబుతున్నారు. ఈ సినిమా షూటింగు అంతా కూడా ఏకధాటిగా కొనసాగుతుందని అంటున్నారు. అంతా అయ్యాక రెండు భాగాలుగా ఈ సినిమాను రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. మొదటి భాగం థియేటర్లకు వచ్చిన మూడు నెలలకి, రెండో భాగం రిలీజ్ చేస్తారట. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మిగతా వివరాలు తెలియనున్నాయి.

 

 

Read more RELATED
Recommended to you

Latest news