నామమాత్రం మ్యాచ్ లో వెస్ట్ ఇండీస్ విజయం… కింగ్ సెంచరీ !

-

వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్ లో ఇప్పటికే మెయిన్ మ్యాచ్ లకు దూరం కాగా.. ఈ రోజు ఒమన్ తో జరిగిన నామమాత్రం మ్యాచ్ లో వెస్ట్ ఇండీస్ వికెట్ల తేడాతో ఘనవిజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్ లో ముందుగా టాస్ గెలిచిన వెస్ట్ ఇండీస్ బౌలింగ్ ఎంచుకుంది.. బ్యాటింగ్ లో ఒమన్ నిర్ణీత ఓవర్ లలో 9 వికెట్ల నష్టానికి 221 పరుగులు మాత్రమే చేయగలిగింది. బ్యాటింగ్ లో షోయబ్ ఖాన్ (50) మరియు సూరజ్ కుమార్ (53) లు అర్ద సెంచరీలతో రాణించినా జట్టుకు మంచి స్కోర్ ను అందించలేకపోయారు. వెస్ట్ ఇండీస్ బౌలింగ్ లో మేయర్స్ 2 మరియు షెపర్డ్ 3 వికెట్లు దక్కించుకున్నారు. అనంతరం 222 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ కు బ్రాండన్ కింగ్ 100 మరియు షై హోప్ 63 లు రాణించి ఏడు వికెట్ల విజయాన్ని అందించారు.

ఇదే తరహా ఇన్నింగ్స్ స్కాట్లాండ్ పై ఆడి ఉంటే ఈ పాటికి వరల్డ్ కప్ కు అర్హత సాధించి ఉండేది. కానీ ఏమి చేస్తాం బ్యాడ్ లక్ వెస్ట్ ఇండీస్.

Read more RELATED
Recommended to you

Latest news