‘శిందే సేన’లో కలవరం.. NCP చేరికతో అసంతృప్తి.. 18 మంది ఎమ్మెల్యేలు జంప్?

-

మహారాష్ట్రలో మరోసారి రాజకీయ సంక్షోభం తలెత్తే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. మహా రాజకీయం రోజుకో కీలక మలుపు తిరుగుతోంది. తాజాగా ఇక్కడి ప్రభుత్వంలో ఎన్​సీపీ అజిత్‌ పవార్‌ వర్గం చేరడం ఏక్‌నాథ్‌ శిందే వర్గంలో అలజడి రేపుతోంది. శిందే శివసేన MLAలు, MLCలు, MPల్లో తీవ్ర అసంతృప్తి రాజేస్తోంది.

అజిత్‌ వర్గం రాకతో.. బీజేపీ, శివసేనలో మంత్రి పదవులు ఆశిస్తున్న నేతలు భంగపాటుకు గురవుతున్నారు. అజిత్‌ వర్గం కలుస్తుందని ముందే తెలుసా అని ఓ MLA శిందేను ప్రశ్నించగా.. ఏ ఆందోళన అవసరం లేదని సీఎం హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అజిత్‌ రాకతో ప్రభుత్వం ఇంకా బలంగా మారిందని సొంత నేతలకు శిందే సర్ది చెప్పారు.

మరోవైపు శిందే వర్గంలోని 17 నుంచి 18 మంది MLAలు తమతో సంప్రదింపులు జరుపుతున్నారని ఉద్ధవ్‌ వర్గం నేత సంజయ్‌ రౌత్‌ పేర్కొన్నారు. శిందే ప్రభుత్వంలో తిరుగుబాటు ప్రారంభమైందనీ.. చాలా మంది తమ సొంతగూటిలో చేరేందుకు సిద్ధమయ్యారని ఆయన తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news